ETV Bharat / bharat

"వారసత్వ రాజకీయాలే వారి అజెండా" - భాజపా

సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. కాంగ్రెస్​ మేనిఫెస్టోను మోసాల పత్రంగా అభివర్ణిస్తూ యూపీ సహారన్​పుర్​ సభలో తీవ్ర విమర్శలు గుప్పించారు.

"వారసత్వ రాజకీయాలకు విపక్షాల ప్రోత్సాహం"
author img

By

Published : Apr 5, 2019, 5:24 PM IST

Updated : Apr 5, 2019, 5:41 PM IST

"వారసత్వ రాజకీయాలే వారి అజెండా"

తనను గద్దెదించి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడమే ప్రతిపక్షాల అజెండా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్​లోని సహారన్​పుర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... వెనకబడిన వర్గాల అభివృద్ధిని కాంగ్రెస్​ పార్టీ అడ్డుకుందని విమర్శించారు. హస్తం పార్టీ మేనిఫెస్టో ఓ పనికిరాని పత్రం అని అభివర్ణించారు.

దేశాన్ని ముక్కలు చేయడమే ప్రతిపక్షాల ధ్యేయమని మోదీ ఆరోపించారు.

"గుర్తుపెట్టుకోండి... వాళ్లు దేశాన్ని ముక్కలు చేసే వ్యక్తులు... మేము ఆడపిల్లలను గౌరవించే వ్యక్తులం. ఏ కాంగ్రెస్​ నాయకుడైతే అంబేడ్కర్​ను కించపరిచారో... అదే నేత ఇప్పుడు ఈ చౌకీదార్​ను 'శౌచాలయ' చౌకీదార్​ అంటున్నారు. ఇది నన్ను అగౌరపరిచే మాట అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు మాత్రం ఇదొక గొప్ప గౌరవం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఎస్పీ, బీఎస్పీపైనా ప్రధాని విమర్శలు చేశారు. సహారన్​పుర్ ప్రజలు విపక్షాల ఓటు బ్యాంకు రాజకీయాలను తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగినప్పుడు మాయవతి తనను ఎద్దేవా చేశారని... కానీ కార్మికులను కాంగ్రెస్​ పార్టీ అగౌరపరచినప్పుడు మౌనంగా ఉన్నారని మోదీ విమర్శించారు.

ఇదీ చూడండి: నాకు ఎప్పుడో పెళ్లైపోయింది: రాహుల్​ గాంధీ

Intro:Body:Conclusion:
Last Updated : Apr 5, 2019, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.