ETV Bharat / bharat

మోదీ 'ఎర్రకోట' ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి - ప్రధాని

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. రేపు ఎర్రకోటపై తొలిసారి జెండా వందనం చేయనున్నారు మోదీ. సర్వత్రా చర్చనీయాంశమైన ఆర్టికల్​ 370 రద్దు​ సహా వివిధ విషయాలపై ప్రధాని ప్రసంగించే అవకాశముంది.

మోదీ 'ఎర్రకోట' ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
author img

By

Published : Aug 14, 2019, 5:56 PM IST

Updated : Sep 27, 2019, 12:27 AM IST

మోదీ 'ఎర్రకోట' ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

73వ స్వాతంత్ర్య దినోత్సవానికి దేశం ముస్తాబవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేయనున్నారు. అనంతరం జాతీనుద్దేశించి ప్రసంగించనున్నారు.

భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి అధికారాన్ని చేపట్టిన అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోదీ ప్రసంగించడం ఇదే తొలిసారి. మొత్తం మీద మోదీకి ఇది 6వ ప్రసంగం కానుంది.

జమ్ముకశ్మీర్​... ఆర్థిక వ్యవస్థ!

స్వచ్ఛ భారత్​, ఆయుష్మాన్​ భారత్​, మానవ సహిత అంతరిక్ష మిషన్​ వంటి అంశాలను మోదీ తన వార్షిక ప్రసంగాల్లో ఇప్పటి వరకు ప్రస్తావించారు. వీటితో పాటు తన ప్రభుత్వ ప్రగతి నివేదిక, దేశాభివృద్ధిపైనా ఇన్నేళ్లు కీలక వ్యాఖ్యలు చేశారు.

గత వారమే జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి... ఆర్టికల్​ 370 రద్దుతో జమ్ముకశ్మీర్​ అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలకు హామీనిచ్చారు. ఇదే అంశంపై ఆగస్ట్​ 15న మోదీ ప్రసంగిస్తారని ఎన్నో రోజులుగా అందరూ భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా మోదీ మాట్లాడతారని సమాచారం.

ఇన్నేళ్లూ దేశంలోని ధనిక, ప్రముఖ వ్యక్తులను స్వచ్ఛ భారత్​ సహా ఇతర కార్యక్రమాలకు మద్దతివ్వాలని కోరిన మోదీ... ఈసారి జల సంరక్షణకు కలిసి రావాలని పిలుపునిచ్చే అవకాశముంది.

తరచూ మోదీ ప్రసంగాల్లో ఆశ్చర్యకర ప్రకటనలుంటాయని.. ఈసారీ అలాంటివి ఆశించవచ్చని కొందరు భాజపా నేతలు అభిప్రాయపడ్డారు.

వాజ్​పేయీ తర్వాత...

దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ 1998-2003 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఈ రికార్డును సమం చేయనున్నారు మోదీ.

ఇదీ చూడండి- వైరల్​: బాలుడిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు

Ladakh, Aug 14 (ANI): The Member of Parliament from Ladakh Lok Sabha constituency Jamyang Tsering Namgyal inaugurated week-long 'Little Tibet Film Festival' on August 13. Film festival is being organised by Tendrel in collaboration with Himalayan Film House (HFH) and Ladakh Media and Culture Society (LMCS). The festival will showcase internationally acclaimed films. "Films of Ladakh are not restricted to entertainment. They bring out the cultural essence, identity, co-existing society, fragile ecosystem and unpolluted environment of Ladakh," said MP Namgyal.
Last Updated : Sep 27, 2019, 12:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.