ETV Bharat / bharat

బిహార్ బరి: నేడు మోదీ, రాహుల్ రెండో విడత ప్రచారం

author img

By

Published : Oct 28, 2020, 5:52 AM IST

బిహార్ రెండో విడత ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. బుధవారం జరగనున్న ప్రచార సభలకు హాజరుకానున్నారు. కొవిడ్ నేపథ్యంలో జరగనున్న ఈ సభలకు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

BH POLL MODI RAHUL
బిహార్ బరి: మోదీ, రాహుల్ రెండో విడత ప్రచారం

బిహార్ ప్రచార పర్వంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అడుగు పెట్టనున్నారు. రెండో దశ పోలింగ్ జరగే నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. తమ కూటముల తరపున అభ్యర్థులకు మద్దతుగా బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

దర్భంగ, ముజఫర్​పుర్, పట్నలో జరిగే బహిరంగ సభలకు మోదీ హాజరు కానున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, భాజపా ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ఈ సమావేశానికి విచ్చేయనున్నారు.

అదేసమయంలో దర్భంగ జిల్లాలోని వాల్మీకి నగర్, కుషేశ్వర్ ఆస్థాన్​లో జరిగే ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అసెంబ్లీ రెండో విడత పోలింగ్ జరిగే నవంబర్ 3వ తేదీనే వాల్మీకి నగర్ లోక్​సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానం నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి తరపున రాహుల్ ప్రచారం చేయనున్నారు.

రెండోసారి

బిహార్​లో రాహుల్, మోదీలు ప్రచారం నిర్వహించడం ఇది రెండోసారి. అక్టోబర్ 23న ఇరువురు నేతలు పలు బహిరంగ సభలలో పాల్గొన్నారు. గయా, భాగల్​పుర్, రోహ్​తాస్ జిల్లాల్లో మోదీ ప్రచారం నిర్వహించగా.. నవాదా, కహల్​గావ్, భాగల్​పుర్ జిల్లాల్లో రాహుల్ పర్యటించారు.

భద్రతా ఏర్పాట్లు

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నందున అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానికి భద్రత కల్పించే ప్రత్యేక రక్షణ దళం(ఎస్​పీజీ) సీనియర్ అధికారులు దర్భంగ జిల్లా మేజిస్ట్రేట్​తో సమావేశమయ్యారు. కరోనా మార్గదర్శకాలు ర్యాలీలో పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కు లేనిదే ప్రచార సభలు జరిగే ప్రాంతానికి ఎవరినీ అనుమతించేది లేదని అధికారుల తెలిపారు. జిల్లాలోని ఎన్డీఏ అభ్యర్థులు వేర్వేరు వేదికలపై కూర్చుంటారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.