" పవార్ ప్రధాని కావాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. కానీ, ఉన్నట్లుండి ఒకరోజు తాను రాజ్యసభ ఎంపీగానే ఆనందంగా ఉన్నానని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలిపారు. ఎన్నికల పవనాలు ఎవరివైపు వీస్తున్నాయో పవార్‌కూ తెలుసు.
కుటుంబ కలహాలతో ఎన్సీపీ సమస్యలు ఎదుర్కొంటోంది. పార్టీపై పవార్ ఆధిపత్యం తగ్గిపోతోంది. ప్రస్తుతం పవార్ సాబ్ మేనల్లుడు పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించటంలో సమస్యలు తలెత్తాయి."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ప్రధాని విమర్శలపై ఎన్సీపీ స్పందన
ప్రధాని వర్ధా సభకు ప్రజలు రానందునే మోదీ నిరాశకు లోనయ్యారు. అందుకే శరద్ పవార్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పందించారు. శరద్ పవార్‌ను ఇప్పటికీ పార్టీ అధినేతగా చూస్తున్నామన్నారు. పవార్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని అంటున్న మీరు.. ఐదేళ్ల పాలనలో మోదీ ఏం చేశారని ఎదురు ప్రశ్న వేశారు మాలిక్.
" ఎల్ కె అడ్వాణీకి మోదీ ఇచ్చిన గౌరవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆయనను రాజకీయాల్లోకి తెచ్చి, ముఖ్యమంత్రిని చేసిన అడ్వాణీని మోదీ అవమానించారు."
-నవాబ్ మాలిక్, ఎన్సీపీ అధికార ప్రతినిధి