దేశంలో హిందూ సంస్కృతికి అపకీర్తి తలపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అందుకే హిందూ తీవ్రవాదాన్ని సృష్టించారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన సిక్కుల మారణకాండపై జరిగిందేదో జరిగిపోయిందని ఆ పార్టీ నేతలు బాధ్యత లేకుండా వ్యాఖ్యానించారన్నారు ప్రధాని. మధ్యప్రదేశ్ ఖంఢ్వా ఎన్నికల ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"1984లో సిక్కుల ఊచోకోత జరిగింది. కాంగ్రెస్ నేతలు జరిగిందేదో జరిగిందని తేలికగా మాట్లాడుతున్నారు. మహాకూటమి, కిచిడీ ప్రభుత్వాలు రక్షణ అందించలేవు. మధ్యప్రదేశ్లో 2.5 సీఎం అధికారంలో ఉన్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదు. గూండాలు, హంతకులు, నేరస్థులకు పూర్తి స్వేచ్ఛ లభించింది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: ఓటు బాధ్యత మరువని వరుడు...