పౌరసత్వ చట్ట సవరణపై కాంగ్రెస్, మిత్రపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ సవరణతో భారతీయ పౌరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఝార్ఖండ్ బెరాహిట్లో ఎన్నికల ప్రచార సభలో స్పష్టంచేశారు.
-
#WATCH PM speaks on #CitizenshipAmendmentAct, in Jharkhand's Berahit. Says "Congress&its allies are creating an atmosphere of lies to scare Indian Muslims. They're spreading violence. Citizenship Amendment Act doesn’t snatch away any right of an Indian citizen or cause any harm." pic.twitter.com/JKRnjF99yu
— ANI (@ANI) December 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH PM speaks on #CitizenshipAmendmentAct, in Jharkhand's Berahit. Says "Congress&its allies are creating an atmosphere of lies to scare Indian Muslims. They're spreading violence. Citizenship Amendment Act doesn’t snatch away any right of an Indian citizen or cause any harm." pic.twitter.com/JKRnjF99yu
— ANI (@ANI) December 17, 2019#WATCH PM speaks on #CitizenshipAmendmentAct, in Jharkhand's Berahit. Says "Congress&its allies are creating an atmosphere of lies to scare Indian Muslims. They're spreading violence. Citizenship Amendment Act doesn’t snatch away any right of an Indian citizen or cause any harm." pic.twitter.com/JKRnjF99yu
— ANI (@ANI) December 17, 2019
'ఈ చట్ట సవరణ కారణంగా ఏ ఒక్క భారత పౌరుడికి ఇబ్బంది కలుగదు. మూడు దేశాల శరణార్థుల కోసం ఈ చట్టాన్ని సవరించాం. మతపరమైన హింసకు లోనై.. వారి దేశాలకు తిరిగి వెళ్లలేని వారికోసమే ఈ చట్టం. కాంగ్రెస్ ఈ చట్ట సవరణపై అసత్యాలు ప్రచారం చేస్తూ.. ముస్లింలను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రజలను ఇబ్బంది పెడుతోంది. అసలు ఈ సవరణ ముస్లింల హక్కులకు ఎలా భంగం కలిగిస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాంగ్రెస్, తన మిత్ర పక్షాలు కలిసి పాకిస్థానీలకు భారత పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగా ప్రకటించగలవా? ఇక విద్యార్థులకు ఈ విషయమై ఏ సమస్య ఉన్నా, ప్రజాస్వామిక పద్ధతిలో చర్చలకు ముందుకు రావాలి .' -ప్రధాని మోదీ.