ETV Bharat / bharat

'కనిష్ఠ స్థాయికి జీడీపీ- 'మోదీ ఉంటే సాధ్యమే''

author img

By

Published : Aug 12, 2020, 11:47 AM IST

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్​ నేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జీడీపీ వృద్ధి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మోదీ ఉంటే అన్ని సాధ్యమే'నంటూ భాజపా ఎన్నికల నినాదాన్ని గుర్తు చేశారు.

'Modi hai to mumkin hai', Rahul Gandhi
1947 తర్వాత కనిష్ఠ స్థాయికి జీడీపీ- 'మోదీ ఉంటే సాధ్యమే'

స్వాతంత్ర్యం అనంతరం తొలిసారి జీడీపీ వృద్ధి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 'మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే' అంటూ ఎన్నికల నాటి భాజపా నినాదాన్ని ప్రయోగిస్తూ ట్వీట్ చేశారు.

1947 తర్వాత జీడీపీ వృద్ధి కనిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ట్వీట్​కు జతచేశారు.

దేశ వాస్తవ జీడీపీ.. 2021 తొలి అర్ధభాగంలో క్షీణిస్తుందని గతవారం ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. చైనా చొరబాట్లు, ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరోనా నిర్వహణపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఇదీ చదవండి- పుట్టిన రోజున కరోనాను జయించిన మాజీ సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.