ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'నేనూ కాపలదారునే' ( మైబీ చౌకీదార్) ప్రచారంపై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూ తీవ్ర విమర్శలు చేశారు. చైనా, అమెరికా, రష్యా అభివృద్ధిలో శర వేగంగా దుసుకుపోతుంటే... భారత్‌లో మాత్రం అందరినీ కాపలాదారులను చేసే కార్యక్రమం నడుస్తోందని ఎద్దేవా చేశారు.
బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సిద్దూ... బడా వ్యాపారుల భవనాలకే చౌకీదారులు కాపలాకాస్తారని, పేదలను విస్మరిస్తారని ఆరోపించారు.
"చౌకీదార్ అంబానీ, అదానీకే కాపలాదారు. ఓట్ల కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటున్నారు. కానీ ఓటు వేశాక సబ్ కా సాత్, అంబానీ, అదానీకా వికాస్ అంటారు. రఫేల్ పత్రాలను కాపాడలేని ఆయన దేశాన్ని ఎలా పాలిస్తానని భరోసా ఇస్తారు? 5 వేల మంది దేశద్రోహులు వెయ్యి కోట్ల రూపాయలను దోచుకుని విదేశాల్లో దాచుకుంటే మీరు ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారు. వీరందరి పేర్లు బయటపెడితే నేనే మీకు ఓటేస్తా మోదీ. రానున్న రోజుల్లో ఇవేం ఉండవు. రాహుల్ ఒక వెలుగులా వస్తారు." - నవజోత్ సింగ్ సిద్దూ, కాంగ్రెస్ నాయకుడు.
మోదీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, నోట్లరద్దుతో పేదల జీవితం అతలాకుతలమైందని విమర్శిచారు సిద్దూ.