ETV Bharat / bharat

'భారత దేశ ఐక్యతను చాటడంలో మోదీ విఫలం' - Modi govt has "failed" to show a united India to the world: Salman Khurshid

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచానికి భారత్ విడిపోయిందన్న భావన కలిగించవద్దని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మన్ ఖుర్షీద్. ఉద్రిక్తతల విషయంలో గందరగోళం నెలకొందని అన్నారు. అణ్వాయుధ దేశాల మధ్య పోరును ప్రపంచం భరించలేదని.. కాబట్టి చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వ భారాన్ని పంచుకోవడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో స్పష్టం చేశారు ఖుర్షీద్.

Modi govt has "failed" to show a united India to the world: Salman Khurshid
సల్మనా ఖుర్షీద్
author img

By

Published : Jun 23, 2020, 4:10 PM IST

చైనాతో సరిహద్దులో హింసాత్మక ఘటన తర్వాత భారత్ ఐక్యంగా ఉందని ప్రపంచానికి చూపించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ విమర్శించారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... చైనా సరిహద్దు ఘర్షణ సహా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపై అభిప్రాయాలు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'దేశంలో ప్రతి సంక్షోభానికి మోదీ విధానాలే కారణం'

చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు వీరమరణం పొందటంపై ఖుర్షీద్ విచారం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతల విషయంలో అస్పష్టత, గందరగోళం ఉందన్నారు. వీటి మధ్య ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వానికి సరైన ఆలోచన లేదని విమర్శించారు. మృతుల కుటుంబాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

నేతల మధ్యే సమస్య!

చైనాకు ఉన్న సమస్య ఏంటో తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఖుర్షీద్. సమస్య ఇరు దేశాల సైన్యాల మధ్య కాదని.. రాజకీయ నాయకుల మధ్యే ఉందని పేర్కొన్నారు. దౌత్యపరమైన మార్గాల్లో చర్చించేటప్పుడు అన్ని విషయాలు ఒకేసారి ప్రస్తావించాల్సిన అవసరం లేదని అన్నారు ఖుర్షీద్.

కాంగ్రెస్ నేత సల్మన్ ఖుర్షీద్​తో ముఖాముఖి

"దౌత్యం చేస్తున్నప్పుడు సరైన వ్యూహంతో వ్యవహరించాలి. అవతలి వారు నిర్దిష్ట పద్ధతిలోనే ఎందుకు వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. చర్చల్లో ప్రతిదీ ప్రస్తావించడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల చాలా వివరాల గురించి మాట్లాడటం మంచిది కాదు. చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో మంచి సంబంధాలున్నాయని ప్రధాని మోదీ చెప్పుకుంటారు కాబట్టి అసలు సమస్య ఏంటో ఆయనే తెలుసుకోవాలి."

-సల్మాన్ ఖుర్షీద్, మాజీ విదేశాంగ మంత్రి

ప్రపంచం భరించలేదు

చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు ఖుర్షీద్. రెండు అణ్వాయుధ దేశాల మధ్య పోరును ప్రపంచం తట్టుకోలేదని పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సంస్కరణల కోసం భారత్ ప్రయత్నిస్తోందని.. ఈ పరిస్థితుల్లో పొరుగుదేశాలతో యుద్ధం చేయడం మంచిది కాదని అన్నారు.

"యుద్ధం అనేది అద్భుతమైన విషయం కాదు. అపారమైన ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధం జరగాలని ఆడంబరమైన ధైర్యసాహసాలు ప్రదర్శించేవారు దేశానికి సేవ చేస్తున్నట్లు కాదు. పొరుగుదేశాలతో కలిసి ఉండాలంటే ఒకరి నుంచి లాక్కోవడం మానేయాలని చైనాను ఒప్పించాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలి. ప్రపంచమంతా ఈ విషయాన్ని గమనిస్తున్నప్పుడు చర్చలు విఫలమవుతాయని అనుకోకూడదు."

-సల్మాన్ ఖుర్షీద్, మాజీ విదేశాంగ మంత్రి

గతంలో జరిగిన విషయాల గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు ఖుర్షీద్. సంకుచిత దృక్పథంతో వ్యవహరించి ప్రపంచానికి భారత్​ విడిపోయిందన్న భావన కలిగించవద్దని కోరారు.

"ఇప్పటి విషయాలపై చర్చించకుండా గతంలోకి ఎందుకు వెళ్తున్నారు? 1993, 1996లో తలెత్తిన అభిప్రాయభేదాలకు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాలు రాబట్టాం. 1993లో చేసుకున్న ఒప్పందం వల్లే సరిహద్దులో శాంతియుత వాతావరణం ఉంది. ఇప్పుడు తీవ్రమైన ప్రాణనష్టం సంభవించింది. గతం గురించి మాట్లాడేందుకే భాజపా శ్రద్ధ చూపిస్తోందంటే.. దానర్థం ప్రస్తుతం జరిగిన విషయాలను దాస్తున్నారనే. ఇప్పుడేం జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలి. ప్రపంచానికి మనం విడిపోయామన్న భావనను ప్రభుత్వం ఎందుకు కలిగిస్తోంది? మనం ఎప్పటికీ విడిపోము, మనల్ని ఎవరూ విభజించలేరు. ఇది భారత సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం. అన్ని రాజకీయ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురాకపోతే ప్రభుత్వం విఫలమైనట్లే."

-సల్మాన్ ఖుర్షీద్, మాజీ విదేశాంగ మంత్రి

చైనా వస్తువులను బహిష్కరించడం వెనక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు ఖుర్షీద్. చైనా వస్తువులను బహిష్కరిస్తే భారత్​కే నష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు. అవసరమైతే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి కానీ, అతిశయోక్తి ప్రకటనలు చేయొద్దని హితవు పలికారు.

అవసరమైన సమయాల్లో ప్రభుత్వం విపక్షాలను సంప్రదించాలన్నారు ఖుర్షీద్. ప్రభుత్వ భారాన్ని పంచుకోవడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

'మోదీని ఆ వివరాలు అడగగలరా నడ్డాజీ?'

ఓవైపు చైనా.. మరోవైపు నేపాల్​... ఎందుకిలా?

'బలగాల ఉపసంహరణపై భారత్​- చైనా కీలక నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.