కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అధికార భాజపా ప్రభుత్వంపై మరోసారి విమర్శలకు ఎక్కుపెట్టారు. తమ పార్టీ దశాబ్దాలుగా నిర్మించిన విదేశీ సంబంధాలను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు . పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు లేకపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు రాహుల్.
భారత్తో బంగ్లాదేశ్ సంబంధాలు బలహీనపడటం వల్ల.. చైనాతో ఆ దేశం బంధాలు బలపడ్డాయని తెలిపే ఓ నివేదికను ఆధారంగా చూపిస్తూ ట్విట్టర్ వేదికగా భాజపాపై విమర్శల దాడి చేశారు రాహుల్.
"ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్మించి, ఏర్పరచుకున్న విదేశీ సంబంధాలను మోదీ నాశనం చేశారు. స్నేహితులు లేని పరిసరాల్లో నివసించడం ప్రమాదకరం."
-రాహుల్ గాంధీ ట్వీట్
పొరుగుదేశాలతో సంబంధాలు బలహీనపడ్డాయని ఆరోపించిన కాంగ్రెస్.. మోదీ ప్రభుత్వ హయాంలో విదేశాంగ విధానం దెబ్బతిందని విమర్శించింది. అయితే.. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది అధికార భాజపా. భారత్తో ఇతర దేశాల సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొంది.
ఇదీ చదవండి: 'సెక్స్ వర్కర్లకు నగదు బదిలీ చేయాలి'