కరోనాపై పోరు విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
"కరోనాపై పోరులో మోదీ ప్రభుత్వం చేసినట్లు చెబుతున్న మంచి ప్రణాళికలు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.
1. 24 శాతం పడిపోయిన జీడీపీ వృద్ధిరేటులో చారిత్రక తగ్గుదల నమోదు చేసింది.
2. 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
3. 15.5 లక్షల కోట్ల అదనపు రుణాలు తీసుకోవాల్సి వచ్చింది.
4. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
కానీ, ప్రభుత్వం మాత్రం అంతా సవ్యంగానే ఉందని చెబుతోంది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఒక్కరోజే 97 వేల కేసులు..
భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 97 వేల 570 మందికి వైరస్ సోకింది. మరో 1201 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 46 లక్షల మార్కు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరుసగా మూడో రోజు దేశంలో 95 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి.
ఇదీ చూడండి: కాంగ్రెస్లో సమూల ప్రక్షాళన! ఆజాద్ పదవులకు కోత