కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 'ప్రభుత్వానికి తక్కువ-ప్రైవేటీకరణకు ఎక్కువ' అన్న విధంగా మోదీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనను నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మోదీ సర్కారుపై మండిపడ్డారు రాహుల్.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను నిలిపివేసిందనే మీడియా కథనాన్ని తన ట్వీట్కు ట్యాగ్ చేశారు రాహుల్. 'ప్రభుత్వ కార్యాలయాల్లో శాశ్వత సిబ్బంది లేకుండా చేయడానికి మహమ్మారిని సాకుగా చూపిస్తున్నారు. యువత భవిష్యత్ను తన సన్నిహితులకు దోచిపెట్టాలని చూస్తున్నారు.' అని రాహుల్ ఆరోపించారు.
ఇదీ చూడండి: 'బాబ్రీ' పరిమాణంలోనే అయోధ్య మసీదు: ఐఐసీఎఫ్