Musheer Khan Accident : యంగ్ క్రికెటర్ ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. తన తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదానికి జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ముషీర్‌కు ఫ్రాక్చర్ కావడం వల్ల దేశవాళీ క్రికెట్‌లో అతను ఆడటం కష్టమే అని క్రికెట్ వర్గాల మాట. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల దులీప్ ట్రోఫీలో భారీ శతకంతో అలరించిన ఈ క్రికెటర్ టీమ్ఇండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్‌కు సోదరుడు.
"ఇరానీ ట్రోఫీ కోసం ముషీర్ మంబయి టీమ్‌తో కలిసి లఖ్‌నవూకు వెళ్లాడు. అయితే వ్యక్తిగత పనుల నిమిత్తం అజమ్‌గఢ్ నుంచి తన తండ్రితో కలిసి లఖ్‌నవూకు వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది" అని క్రికెట్ వర్గాల తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనకు మిస్!
నవంబర్ రెండో వారం నుంచి భారత సీనియర్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే అంతకుముందే అక్టోబర్ 31 నుంచి ఇండియా A టీమ్ కూడా ఆసీస్ Aతో రెండు మ్యాచ్‌ల కోసం పోటీపడనుంది. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ముషీర్‌ఖాన్ కూడా ఈ తుది జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడీ ప్రమాదంలో వల్ల అతడ్ని తీసుకుంటారా? లేదా? అనేది అనుమానంగా మారింది. అయితే అప్పటికి అతడు ఫిట్‌నెస్ సాధించాల్సి కూడా ఉంటుంది.
Musheer Khan Century : గతంలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2024లో ఈ భారత యువ ఆటగాడు అదిరే ప్రదర్శన చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడి శతకంలో చెలరేగిపోయాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఈ యంగ్ ప్లేయర్ తన ఆట తీరుతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు.