Fresh Water Project Tender For Musi : మూసీలో సుందరీకరణలో భాగంగా ఏడాది పొడవునా మంచినీటిని వదిలేందుకు వీలైన ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారంలోనే టెండర్లను పిలవనుంది. హైదరాబాద్‌కు మల్లనసాగర్ నుంచి 15 టీఎంసీల తాగునీటిని తీసుకువచ్చే ప్రాజెక్టును సంవత్సరంలోగా పూర్తి చేయడానికి కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.5,500కోట్ల ప్రాజెక్టుపై పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ శుక్రవారం సమీక్షించారు. తక్షణం టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీంతో అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
విడతల వారీగా రెండు టీఎంసీల నీరు : పైప్‌లైన్ ద్వారా జంటజలశయాలకు ప్రభుత్వం రాజధాని పరిధిలో 55కి.మీ.ల పొడవున్న మూసీ సుందరీకరణ చేపట్టింది. ఇది పూర్తయ్యేవరకు మూసీలో నిరంతరాయంగా మంచినీటి ప్రవాహం ఉంటేనే ఫలితం ఉంటుందని అధికారులు సూచించారు. ఇందుకు జంట జలాశయాల నుంచి సంవత్సరంలో రెండున్నర టీఎంసీల నీటిని విడతల వారీగా విడుదల చేయాలని అభిప్రాయపడుతున్నారు.
గోదావరి నుంటి నీటిని తీసుకొస్తేనే ది సాధ్యమని ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తక్షణం చేపట్టాలని నిర్ణయించింది. మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని తీసుకువచ్చే పైప్‌లైన్ ప్రాజెక్టును అధికారులు రూపకల్పన చేశారు. 12.5 టీఎంసీల నీటిని ఘనపూర్ రిజర్వాయర్‌కు తెచ్చి అక్కడ శుద్ధి చేసి నగర అవసరాలకు ఉపయోగిస్తారు. మిగిలిన రెండున్నర టీఎంసీలను పైపులైను ద్వారా జంటజలాశయాలకు తీసుకురావాలని నిర్ణయించారు. జలాశయాలకు నీరు చేరిన తరువాత అవసరమైనప్పుడు సుందరీకరణ చేసిన మూసీలోకి వదిలేందుకు ప్లాన్ చేశారు.
మరోవైపు మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుతోనే సరిపెట్టకుండా మహిళలకు రుణాలు, చిన్నారులను హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వాసితులకు అన్నిరకాల తోడ్పాటును అందించిన తర్వాతే కూల్చివేతలను మొదలుపెట్టాలని భావిస్తోంది. మూసీ పునరావాసం అంశంపై ఎమ్మార్డీసీ ఎండీ దాన కిశోర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
చట్ట ప్రకారం రావాల్సిన ప్రయోజనాలపై సమీక్ష : ఉపాధి కల్పన, పట్టా ఉంటే చట్ట ప్రకారం రావాల్సిన ప్రయోజనాలు, ఆయా కుటుంబాల్లోని పిల్లలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల సమన్వయంతో అర్హులకు పథకాలు అందేలా చూస్తామన్నారు.
'మా ఇళ్లు కూల్చొద్దు' మూసీ రివర్ బెడ్ నిర్వాసితుల డిమాండ్ - Residents Protest At MRO Office