ETV Bharat / entertainment

ఆ పాత్ర కోసం ఆయన భార్యను కలిశాను : 'అమరన్‌' సాయి పల్లవి - Amaran Saipallavi - AMARAN SAIPALLAVI

Amaran Saipallavi : 'అమరన్‌' సినిమాలో ఇందు రెబెకా పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్ ఆధారంగా ఇది తెరకెక్కింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ స్పెషల్‌ ఇంట్రో వీడియోను షేర్‌ చేసింది. ఇందుగా సాయి పల్లవి నటన చూసి సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Amaran Saipallavi (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2024, 1:40 PM IST

Updated : Sep 28, 2024, 1:46 PM IST

Amaran Saipallavi : కోలీవుడ్​ హీరో శివ కార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం అమరన్‌. ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్ ఆధారంగా ఇది తెరకెక్కింది. దర్శకుడు రాజ్‌ కుమార్‌ పెరియసామి దీన్ని తెరకెక్కిస్తున్నారు.

శివ కార్తికేయన్‌ ముకుంద్‌ పాత్ర పోషిస్తున్నారు. ఆయన సతీమణి ఇందు రెబెకా పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ స్పెషల్‌ ఇంట్రో వీడియోను షేర్‌ చేసింది. ఇందుగా సాయి పల్లవి నటన చూసి సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది.

అలానే తన పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పింది. "నేను ఇప్పటి వరకు ఎటువంటి బయోపిక్‌లో నటించలేదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాను. పాత్రను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పని చేశాను. ఎమోషన్స్​కు పూర్తి న్యాయం చేయాలని అనుకునేదానిని. అమరన్‌ అవకాశం వచ్చిన తర్వాత ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని భావించాను. ఇందుకోసం ముకుంద్‌ భార్య ఇందు రెబెకాను కలిశాను. ఆమెతో ఎన్నో విషయాల గురించి మాట్లాడాను. పాత్రకు సంబంధించిన ఎమోషన్స్‌పై అవగాహన పొందాను" అని సాయిపల్లవి పేర్కొన్నారు.

రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ బ్యానర్​పై కమల్‌హాసన్‌ దీనిని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబరు 31న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సుధాకర్‌ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్​పై విడుదల చేయనున్నారు.

Sai Pallavi Upcoming Movies : ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే, ఆమె నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'తండేల్‌' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. దీనికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా నితీశ్‌ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం రామాయణ్‌లోనూ సీతగా నటిస్తోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. దీంతో పాటే హిందీలో మరో ప్రాజెక్ట్​లోనూ నటిస్తోంది.

ఈ వారం 12 సినిమా/సిరీస్​లు - మూవీ లవర్స్​ ఫోకస్​ ఆ మూడు చిత్రాలపైనే! - This Week OTT Releases

కాంట్రవర్సీ కామెంట్స్​పై రిషభ్​ శెట్టి క్లారిటీ - ఏం చెప్పారంటే? - Rishab Shetty Bollywood Comments

Last Updated : Sep 28, 2024, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.