ETV Bharat / bharat

'ఫొనిపై మోదీతో దీదీ ఫోన్​లో మాట్లాడలేదు'

బంగాల్​ ముఖ్యమంత్రితో ఫొని తుపాను ప్రభావంపై ప్రధాని చర్చించలేదని తృణమూల్​ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఓ ఉన్నతాధికారి స్పందించారు. నిజానికి మోదీ రెండు సార్లు మమతతో మాట్లాడడానికి ప్రయత్నించారని... కానీ ముఖ్యమంత్రి స్పందించలేదని అన్నారు. అనంతరం గవర్నర్​తో మోదీ చర్చించారని తెలిపారు.

'ఫొనిపై మోదీతో దీదీ ఫోన్​లో మాట్లాడలేదు'
author img

By

Published : May 5, 2019, 4:40 PM IST

Updated : May 5, 2019, 7:49 PM IST

మోదీ ప్రయత్నంచినా... మమత మాట్లాడలేదు

ఫొని తుపాను ప్రభావంపై బంగాల్​ ముఖ్యమంత్రితో చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నించారని... కానీ మమతా బెనర్జీ స్పందించలేదని ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ముఖ్యమంత్రితో సంభాషణ కుదరకపోవడం వల్ల ఆ రాష్ట్ర గవర్నర్​ కేసరి నాథ్​ త్రిపాఠితో మోదీ చర్చలు జరిపారని స్పష్టం చేశారు.

"మమతతో ఫోనులో మాట్లాడటానికి ప్రధాని రెండుసార్లు ప్రయత్నించారు. కానీ ఆ రెండు సార్లూ ముఖ్యమంత్రి తిరిగి సంప్రదిస్తారనే సమాధానమొచ్చింది. ఒకసారైతే ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారని అన్నారు."
- ఉన్నతాధికారి.

ఫొని తుపాను ప్రభావంపై మమతను మోదీ సంప్రదించలేదని తృణమూల్​ కాంగ్రెస్​ ఆరోపించిన అనంతరం ఉన్నతాధికారి ఈ వ్యాఖ్యలు చేశారు.

తుపాను నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారంపై బంగాల్​ గవర్నర్​తో చర్చించినట్టు ప్రధాని శుక్రవారం ట్వీట్​ చేశారు.

  • Spoke to Shri Keshari Nath Tripathi Ji, the Governor of West Bengal on the situation due to Cyclone Fani. Reiterated the Centre’s readiness to provide all help needed to cope with the cyclone. Also conveyed my solidarity with the people of Bengal in the wake of Cyclone Fani.

    — Chowkidar Narendra Modi (@narendramodi) May 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ఐదో విడత సార్వత్రిక పోలింగ్​​కు సర్వం సిద్ధం

Intro:Body:Conclusion:
Last Updated : May 5, 2019, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.