ETV Bharat / bharat

"ప్రచారాన్ని వీడలేరు" - dhule

ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రధాని ఐదు నిమిషాలు సైతం బహిరంగ సభలను వీడి ఉండలేకపోతున్నారని ఆరోపించారు.

"సభలను వీడలేకపోతున్నారు"
author img

By

Published : Mar 2, 2019, 8:24 AM IST

Updated : Mar 2, 2019, 9:30 AM IST

మహారాష్ట్రలోని ధూలెలో పర్యటించారు రాహుల్​ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. పుల్వామా ఘటన అనంతరం మోదీ తమపై విమర్శలు చేయటంపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షుడు.

"సభలను వీడలేకపోతున్నారు"

ఐదు నిమిషాల సవాల్

undefined

మోదీకీ ధైర్యముంటే ఐదు నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని సవాల్ విసిరారు రాహుల్​. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించలేదని అన్నారు.

పుల్వామా ఘటన అనంతంరం ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దని, అందరు ఏకతాటిపై నిలబడాలని కార్యకర్తలకు సూచించామని అన్నారు రాహుల్​. ప్రధాని మోదీ మాత్రం దిల్లీలో యుద్ధ స్మారకం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్​పై విమర్శలు చేశారని గుర్తు చేశారు.

నోట్ల రద్దుతో ఏం సాధించారు?

ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటన అనంతరం నల్లధనం బయటకు వస్తుందనుకున్న ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందని రాహుల్​ వ్యాఖ్యానించారు. "సాధారణ ప్రజలు మాత్రమే బ్యాంకుల ముందు బారులు తీరారు. అనిల్ అంబానీ, నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీ, విజయ్​ మాల్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు" అని విమర్శించారు.

పేదలకు కనీస ఆదాయం

కాంగ్రెస్ అధికారంలో వస్తే పేదలకు కనీస ఆదాయ పథకాన్ని తప్పకుండా ప్రవేశపెడతామని మరోమారు స్పష్టం చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు.

వారిది విద్వేషం.. మాది ప్రేమ

"అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి. ఈ దేశం ప్రేమకు నిలయం. భాజపా ఎక్కడికెళ్లినా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది. మేము ప్రేమను వ్యాప్తి చేస్తాము" అని రాహుల్ అన్నారు.

అబద్దాల సభలు

మోదీ ఎక్కడికెళ్లినా అబద్దాలే ప్రచారం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. నిజాలు తెలుసుకోవాలనుకునే వారు కాంగ్రెస్ సభలకు రండి. అబద్దాలు వినాలనుకునే వారు మోదీ సభలకు వెళ్లండి అని ప్రజలకు సూచించారు.

undefined

ప్రజలను మిత్రులుగా సంబోధించే ప్రధాని, ఆర్థిక నేరగాడు నీరవ్​ మోదీని మాత్రం సోదరా అంటూ ఆప్యాయంగా పిలుస్తారని వ్యంగాస్త్రాలు విసిరారు రాహుల్​ గాంధీ.

"మీరు అబద్దాలు వినాలనుకుంటే ఇది సరైన ప్రదేశం కాదు. మీకు అబద్దాలు కావాలంటే మోదీ సభలకు వెళ్లండి. మెహుల్​ చోక్సీని సోదరా అని పిలుస్తారు. మిమ్మల్ని స్నేహితులారా అంటారు. "

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షులు

Dhule (Maharashtra), March 2 (ANI): Congress president Rahul Gandhi on Friday said that Prime Minister Narendra Modi cannot leave his PR exercise even for five minutes, though the country is faced with a challenging situation following Pulwama terror attack and the aerial strikes by the Indian Air Force (IAF) in Pakistan. He said, "We had decided to stop criticising the government as we wanted to stand united with all in the country after Pulwama attack. When the Prime Minister addresses the media, he says that India is united, but he attacks the Congress. He cannot even stop his PR activities for at least five minutes. That is the difference between me and him."
Last Updated : Mar 2, 2019, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.