సొంత నియోజక వర్గంలోని కాశీ విశ్వనాథుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వారణాసి అభివృద్ధికి గత సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు. అందుకే అభివృద్ధి పనులకు ఆలస్యమైందని అన్నారు.
కాశీకి ప్రపంచ గుర్తింపు లభించేలా చేస్తానని హామీ ఇచ్చారు మోదీ. ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగీ ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టాకే అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ప్రశంసించారు.
"నేను అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలో అప్పటి యూపీ ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ అభివృద్ధి పనులన్నీ ఈ పాటికే పూర్తయ్యేవి. ఆ మూడేళ్లలో పరస్పర సహకారం లేదు. అందుకే అభివృద్ధి పనులు చేపట్టలేక పోయాం. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక వారణాసి అభివృద్ధి పనుల్లో పురోగతి లభించింది. "
-నరేంద్ర మోదీ. ప్రధాన మంత్రి