ETV Bharat / bharat

'అమేఠీ రైఫిల్ వస్తోంది'

కోర్బా ఆయుధ కర్మాగారంలో అత్యాధునిక కలష్నికోవ్ శ్రేణి ఏకే- 203 రైఫిళ్లను తయారుచేయనున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్​సభ నియోజకవర్గం అమేఠీలో స్మృతి ఇరానీ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని ప్రకటించారాయన.

author img

By

Published : Mar 3, 2019, 8:10 PM IST

అమేఠీలో మోదీ ప్రసంగం

అమేఠీలోని కోర్బా ఆయుధ కర్మాగారంలో అత్యాధునిక కలాష్నికోవ్-203 రైఫిళ్లను తయారు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠీలో మరోసారి స్మృతి ఇరానీ పోటీ చేయనున్నట్లు ఆ పట్టణంలో జరిగిన ర్యాలీ వేదికగా తెలిపారు.

భాజపాకు ఓటు వేసిన వారిని, రాహుల్​కు మద్దతుగా నిలబడిన వారిని ఒకే తరహాలో చూస్తున్నామని తెలిపారు మోదీ.

రష్యా భాగస్వామ్యంతో కలష్నికోవ్ రైఫిళ్లను తయారుచేయనున్నట్లు ప్రకటించారు మోదీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్మీ అవసరాల్ని విస్మరించిందని ఆరోపించారు.

అమేఠీలో మోదీ ప్రసంగం

స్మృతి ఇరానీ అమేఠీ అభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. మీరు గెలిపించారా ఓడించారా అని చూడలేదు. గెలిచిన వారికంటే ఎక్కువ పనిచేసి చూపించారు. కోర్బా ఆయుధ కర్మాగారంలో ప్రపంచంలోని అత్యాధునిక రైఫిల్ కలష్నికోవ్​ను తయారుచేయనున్నాం. దీనిని రష్యా, భారత్ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందించనున్నాం. ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించటంలో ఎంతో ఉపకరించనుంది ఈ ఆయుధ కర్మాగారం. కాంగ్రెస్ వారు హామి ఇచ్చారు... ఆయుధ కర్మాగారంలో 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.. అమేఠీ ప్రజల్ని మోసం చేసి కేవలం 2 వందల మందికే ఉద్యోగాలు కల్పించారు. నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.