కశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. దేశంలోని రైల్వే స్టేషన్లను పేల్చేస్తామని ఇటీవల లేఖ పంపిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ నేడు మరో లేఖ పంపింది.
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ను హిట్ లిస్ట్‌లో చేర్చామంటూ పౌర విమానయాన విభాగం బ్యూరో సెక్రటరీకి లేఖ అందింది. ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా ఈ పని చేసినట్లు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ లేఖలో పేర్కొంది. మోదీ, అమిత్ షాపైనే కాకుండా మరో 30 నగరాల్లో దాడి చేస్తామని లేఖలో పేర్కొన్నారు. జైషే లేఖతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.