కాంగ్రెస్ నేతలు తనపై అభ్యంతరకరమైన భాష ఉపయోగిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తప్పుపట్టడాన్ని గుర్తుచేసిన మోదీ... దుర్భాషలాడే విషయంలో కాంగ్రెస్ నేతలు తన తల్లిని కూడా విడిచిపెట్టలేదని కురుక్షేత్రలో జరిగిన బహిరంగ సభ వేదికగా ఆరోపించారు.
మోదీ తన తండ్రిని తిట్టినప్పటికీ ఆయనను ప్రేమగా ఆలింగనం చేసుకుంటానన్న రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదూ చూడండి: "యువత, రైతులే 'చౌకీదార్ చోర్‌హై' సృష్టికర్తలు"