రఫేల్‌పై విపక్షాలు ఫెయిల్
రఫేల్‌పై కోర్టులో పూర్తిస్థాయి విచారణ జరిగిందని ప్రధాని అన్నారు. పార్లమెంటులో జరిగిన చర్చల్లో రఫేల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించినట్టు స్పష్టం చేశారు. కాగ్‌కూ, సుప్రీంకోర్టుకూ అవే విషయాలు తెలియజేశామని, అన్నిచోట్ల తమకు క్లీన్చిట్ లభించిందన్నారు. కానీ రాజకీయ లబ్ధికోసమే కొందరు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మోదీ. ఈ విషయంపై మీడియా వ్యవహరిస్తున్న తీరును ప్రధాని తప్పుపట్టారు. ఎలాంటి ఆధారాలు లేని రఫేల్‌కు ఇచ్చినంత ప్రాధాన్యం... పూర్తి సాక్ష్యాధారాలున్న అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ కేసులకు ఎందుకు ఇవ్వడం లేదని మోదీ ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు బెయిల్‌పై ఎందుకు తిరుగుతున్నారన్న వార్తనూ మీడియా ఇవ్వకపోవడం సరికాదని తెలిపారు.
నేనూ సీబీఐ బాధితుడినే
భాజపా పాలనలో రాజ్యంగ వ్యవస్థలపై దాడి జరుగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ప్రధాని పునరుద్ఘాటించారు. తమ అజెండాకు మద్దతివ్వలేదనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభిశంసన తీర్మానం పెట్టిందని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని, ఈవీఎంలను తిట్టడం ప్రజలు చూస్తూనే ఉన్నారని తెలిపారు. సీబీఐ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి కొత్త డైరెక్టర్‌ను నియమించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన సీబీఐ దుర్వినియోగానికి తానే ప్రత్యక్ష బాధితుడినని అన్నారు. అందుకే దేశ వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
మోదీతో ఈనాడు ముఖాముఖి ఇతర భాగాలు: