రాబోయే వారాల్లో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడులో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అదే సమయంలో వచ్చేవారం నుంచి ఉత్తర భారతదేశంలో చలిగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని తెలిపింది.
వచ్చే 2-3 రోజుల్లో అరేబియా సముద్రంలో తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని ఫలితంగా తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది.
ఇదీ చదవండి: దిల్లీలో 21 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం