హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా జైలు గదిలో సెల్‌ఫోన్ లభించినట్లు తిహార్ జైలు అధికారులు తెలిపారు. గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా చౌతాలా గదిలో సెల్‌ఫోన్‌తో పాటు ఛార్జర్, పొగాకు సంచి గుర్తించినట్లు వెల్లడించారు.
ఆ సెల్‌ఫోన్ తనదేనని చౌతాలాతో పాటు అదే జైలు గదిలో ఉండే రమేశ్ చెప్పాడు.
స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగానికి అప్పగించారు. ఆ ఫోన్ ద్వారా ఎవరితో సంభాషించారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హరియాణాలో ఉపాద్యాయ నియామక కుంభకోణం కేసులో 10ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు చౌతాలా. 21 రోజుల పెరోల్ అనంతరం బుధవారం తిరిగి తిహార్ జైలుకు చేరుకున్నారు.
ఇదీ చూడండి: మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితులకు బెయిల్