'ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలోని మెట్రో ఛానల్ వద్ద ధర్నా ప్రారంభించారు. దీన్ని ఆమె 'సత్యాగ్రహం'గా అభివర్ణించారు. ఈ ధర్నాలో పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
భాజపా సీబీఐని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంపై దాడులకు పురిగొల్పుతోందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసమే సత్యాగ్రహం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.