కేరళలోని అలప్పుజాలో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ హౌస్ బోటు అగ్నిప్రమాదానికి గురైంది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంవల్ల అందులో ప్రయాణిస్తున్న వారంతా నీటిలోకి దూకి, సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
కన్నూరుకు చెందిన 16 మంది గురువారం హౌస్బోటులో కుమారకోమ్ నుంచి పథిరమన్నాల్కు బయల్దేరారు. అయితే మార్గమధ్యంలోనే పడవ అగ్నిప్రమాదానికి గురైంది.
ఇదీ చూడండి: 71వ 'రిపబ్లిక్ డే'కు 71వేల టూత్పిక్లతో త్రివర్ణ పతాకం