ETV Bharat / bharat

రైల్లో గ్యాస్​ లీకేజీ- తప్పిన పెను ప్రమాదం - గూడ్స్​

మధ్యప్రదేశ్​ భోపాల్​ రైల్వే స్టేషన్​లో పెనుప్రమాదం తప్పింది. గూడ్సు రైలులోని ఎల్​పీజీ కంటైనర్​లో గ్యాస్​ లీకయింది. అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముందే గుర్తించకుంటే.. ఒక్కో దాంట్లో 37 టన్నుల మేర గ్యాస్​ నింపి ఉన్న ట్యాంకర్లు పేలి భారీ నష్టం వాటిల్లేది.

Minor gas leak in LPG container of goods train at Bhopal
భోపాల్​లో గ్యాస్​లీక్​
author img

By

Published : May 9, 2020, 3:10 PM IST

Updated : May 9, 2020, 4:41 PM IST

32 ట్యాంకర్ల నుంచి ఒక్కసారిగా గ్యాస్​ లీకైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి భయానక ఘటన మరొకటి ఉండదు. వేలాది మందికి విషాదాన్ని మిగిల్చిన మధ్యప్రదేశ్​లోని భోపాల్ గ్యాస్​ లీకేజీ లాంటి దుర్ఘటన పునరావృతమయ్యేదే. కానీ.. త్రుటిలో తప్పింది. కర్ణాటక నుంచి గూడ్సులోని 32 కంటైనర్లలో గ్యాస్​ నింపుకొని వెళ్తుండగా లీకేజీ సమస్య తలెత్తింది. రెండు వేర్వేరు రైల్వే స్టేషన్లలో సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని థూపుర్​​ రైల్వే స్టేషన్​ నుంచి​ ఎల్​పీజీ ట్యాంకర్లను మధ్యప్రదేశ్​ భోపాల్​ సమీపంలోని బకానియా ఎలీపీజీ డిపోకు తరలిస్తోంది గూడ్సు రైలు. మొత్తం 32 ట్యాంకర్లు గ్యాస్​తో నిండి ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్​లో​ దాదాపు 37.8 టన్నుల గ్యాస్​ ఉంది.

శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు గూడ్సు.. మధ్యప్రదేశ్​లోని ఖాండ్వా స్టేషన్​ వద్ద ఆగింది. అదే సమయంలో ట్యాంకర్​ నుంచి గ్యాస్​ లీకవుతున్నట్లు.. ఓ గార్డు గుర్తించి అధికారుల్ని అప్రమత్తం చేశాడు. రైల్వే అధికారులు, టెక్నీషియన్లు అందరూ రాత్రి 8 గంటల లోగా చేరుకొన్నారు. విద్యుత్ సరఫరా నిలిపి వేయించిన రైల్వే అధికారులు.. ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పరిస్థితిని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ముందు జాగ్రత్తగా.. దాదాపు బ్లాక్​ అవుట్​ పరిస్థితుల్ని సృష్టించి స్థానిక కలెక్టర్​, ఎస్పీ, విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం అందించారు.

భోపాల్​ రైల్వే స్టేషన్​ వద్ద తప్పిన ప్రమాదం

తీవ్రంగా శ్రమించిన అనంతరం.. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో సమస్య పరిష్కారమైంది. అనంతరం.. రైలు అక్కడి నుంచి కదిలింది.

మళ్లీ భోపాల్​లో...

అయితే.. అదే సమస్య తిరగబెట్టింది. శనివారం ఉదయం 11.30 గంటలకు గూడ్సు.. భోపాల్​ రైల్వే స్టేషన్​ వద్ద ఆగిన సమయంలో కంటైనర్​ నుంచి గ్యాస్​ లీకేజీని గుర్తించిన అధికారులు వెంటనే పరిష్కరించారు. ఒకవేళ.. ముందే గుర్తించకపోతే భారీ పేలుడు సంభవించి పెద్ద ప్రమాదం జరిగేదే. గూడ్సు చేరాల్సిన బకానియా ఆయిల్​ కంపెనీ.. భోపాల్​ స్టేషన్​ నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Last Updated : May 9, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.