ETV Bharat / bharat

లాక్​డౌన్​ వేళ జ్ఞానాన్ని పెంచుకోండి ఇలా!

author img

By

Published : Apr 1, 2020, 7:28 PM IST

Updated : Apr 1, 2020, 7:46 PM IST

ప్రస్తుతం దేశంలో 21 రోజుల లాక్​డౌన్ కొనసాగుతోంది. బిజీబిజీగా గడిపిన ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయిన నేపథ్యంలో ప్రజలంతా దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు. అప్పటివరకు కార్యాలయాల్లో శ్రమించినవారు.. ఇంట్లో ఖాళీగా కూర్చుని బోర్ ఫీలవుతున్నారు. దీనికి చెక్​ పెట్టేందుకు డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రాంలను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర మానవ వనరుల శాఖ. ఖాళీగా కూర్చోకుండా విద్యార్థులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చని సూచిస్తోంది. ఈ వివరాలు మీకోసం.

Ministry of HRD offers different digital learning programmes. Learn online during Lockdown
లాక్​డౌన్​ వేళ.. జ్ఞానాన్ని పెంచుకోండి ఇలా!

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించి వైరస్​ కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీనివల్ల విద్యార్థులు, అభ్యాసకులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల ప్రజలు విసుగు చెందుతారని భావించిన ప్రభుత్వం జ్ఞానాన్ని పెంచుకునేందుకు పలు డిజిటల్​ లెర్నింగ్​ ప్రోగ్రామ్​లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్​ఆర్​డీ) ఆన్​లైన్​ తరగతులను ప్రారంభించినట్లు ట్విట్టర్​లో ప్రకటన చేసింది.

'స్వయం' ద్వారా..

భారత ప్రభుత్వం 'స్వయం' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిని విద్యావిధానంలోని మూడు ప్రధాన అంశాల సాధన కోసం రూపొందించారు. ఇందులో విభిన్న కోర్సులు అందుబాటులో ఉంటాయి. జనవరి 2020లో చేరిన విద్యార్థులు తమ కోర్సును కొనసాగించవచ్చు. మరింత సమాచారానికి www.swayam.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

విద్యార్థుల నేస్తం-'స్వయంప్రభ' ఛానల్​

జీఎస్​ఏటీ-15 ఉపగ్రహం ద్వారా ఎల్లప్పుడూ అత్యంత నాణ్యతతో విద్యా కార్యక్రమాలు ప్రసారం చేయడానికి రూపొందించిన 32 డీటీహెచ్​ ఛానల్సే స్వయంప్రభ. ఇందులో విద్యార్థులకు అవసరమైన ప్రతి తాజా సమాచారాన్ని ప్రసారం చేస్తారు. ఇందులో విద్యార్థులు, నేర్చుకునేవారు తమకు కావల్సిన ప్రోగ్రాం ప్రసారమైన సమయాన్ని ఎంచుకుని వీక్షించే వెసులుబాటు ఉంటుంది. ఎన్​పీటీఈఎల్​, ఐఐటీలు, యూజీసీ, సీఈసీ, ఐజీఎన్ఓడబ్ల్యూ, ఎన్​సీఈఆర్​టీ, ఎన్ఐఓఎస్​లు సమాచారాన్ని అందిస్తాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, లా వంటి డిగ్రీ, పీజీ స్థాయి పాఠాలు, 9 నుంచి 12 తరగతుల వారి పాఠాలు ఉంటాయి. మరింత సమాచారం కోసం www.swayamprabha.gov.in లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

నేషనల్​ డిజిటల్ లైబ్రరీ

పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను డిజిటల్ రూపంలో పొందేందుకు నేషనల్​ డిజిటల్​ లైబ్రరీ ఉంచింది సర్కారు. తమకు అవసరమైన పుస్తకాలను దీనిద్వారా చదవొచ్చు. వెబ్ అడ్రెస్ www.iitkgp.ac.in .

పరిశోధనల సమాచారం కోసం శోధ్​గానా..

భారతీయ పరిశోధనలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే 'శోధ్​గానా'లో లాగిన్ కావాల్సిందే. ఇందులో ఎలక్ట్రానిక్ పరిశోధనలు, వ్యాసాలు అందుబాటులో ఉంటాయి. వెబ్ అడ్రస్ www.ssg.inflibnet.ac.in

నైపుణ్య విద్య- ఈ-శోధ్​సింధు

యూజీసీ-ఇన్ఫోనెట్​ డిజిటల్ లైబ్రరీ, ఎన్​ఎల్​ఐఎస్​టీ, ఇండెస్ట్​-ఏఐసీటీఈ సంస్థలు కలిసి ఏర్పాటు చేసిందే ఈ-శోధ్​సింధు. ఇందులో ఆయా కోర్సులకు చెందిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ఇందులో 15 వేలకు పైగా జర్నల్స్ ఉంటాయి. ఆసక్తి ఉంటే లాగిన్ కావాల్సిన వెబ్​ అడ్రస్ https://vidwan.inflibnet.ac.in

విద్వాన్​..

దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకుల నేపథ్యం, సాధించిన విజయాలు వంటి వివరాలు.. ప్రముఖ విద్యాసంస్థలు, ఇతర పరిశోధన సంస్థల సమాచారం కావాలంటే విద్వాన్ పోర్టల్​లోకి లాగిన్ కావాల్సిందే. https://vidwan.inflibnet.ac.in

భారత్​ వాణి..

వివిధ భాషలను నేర్చుకునేందుకు భారత్​వాణి పోర్టల్ సహాయపడుతుంది. ఇందులో అందుబాటులో ఉండే భాషలు.. నేర్చుకోవడంలో తీసుకునే జాగ్రత్తలు.. పాఠాల కోసం www.bharatvani.in

మరిన్ని..

ఈ- పీజీ పాఠశాలలో 70 కంటే ఎక్కువ సంఖ్యలో పోస్ట్​ గ్రాడ్యుయేషన్​కు సంబంధించిన వివిధ కోర్సులు అందుబాటులో ఉంటాయి. వివరాల కోసం హెచ్​ఆర్​డీ మంత్రిత్వశాఖ వెబ్​సైట్​ను సందర్శించండి.

  • Students of classes VII -X, stay connected with your studies during #Lockdown21 with @cbseindia29's Creative and Critical Thinking (CCT) Weekly Practice Programme.
    Thought-provoking Creative And Critical Thinking Questions on Maths, Science, English and Hindi! pic.twitter.com/vqmvZHQ0GG

    — Ministry of HRD (@HRDMinistry) March 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: ఆపరేషన్​ మర్కజ్​: ఆ 5 రైళ్లలో వెళ్లిన వారి కోసం వేట

Last Updated : Apr 1, 2020, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.