భారత వాయుసేన నూతన అధిపతిగా రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియాను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 30 నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుతం వాయుసేన ఉపఅధిపతిగా ఉన్న రాకేశ్ కుమార్ బదౌరియాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 1980 జూన్ 15న వాయుసేనలో చేరిన బదౌరియాకు 26 రకాల యుద్ధ విమానాలను 4,250 గంటలు నడిపిన అనుభవముంది. 36 ఏళ్ల వృత్తి జీవితంలో 'అతి విశిస్ట్ సేవా' సహా పలు మెడళ్లు పొందారు బదౌరియా.