ETV Bharat / bharat

వలస కూలీల 'మహా' నిరసనపై దర్యాప్తు- ఇద్దరు అరెస్టు - Bandra Railway station

ముంబయి బాంద్రాలో మంగళవారం వలస కార్మికుల నిరసన వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆందోళనల వెనుక కుట్ర జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేయిస్తోంది. పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

Migrants protest: Man held for offensive social media posts
వలస కూలీల 'మహా' నిరసనపై దర్యాప్తు- ఇద్దరు అరెస్టు
author img

By

Published : Apr 15, 2020, 12:22 PM IST

Updated : Apr 15, 2020, 12:58 PM IST

ముంబయిలో వలస కార్మికులు మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తీవ్ర ఉద్రిక్తతలకు, లాఠీఛార్జికి దారితీసిన ఈ ఘటన కుట్రపూరితంగా జరిగిందన్న కోణంలో మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నారు. వలస కార్మికులను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ టీవీ జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు.

పోస్ట్​లో ఏముంది?

మహారాష్ట్ర ప్రభుత్వం వలసదారులకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు నవీ ముంబయికి చెందిన వినయ్‌ దూబే. లాక్‌డౌన్‌ కారణంగా కార్మికులంతా ఇక్కడే చిక్కుకుపోయారని, వారంతా తమ స్వస్థలాలకు వెళ్లాలని కోరుతున్నట్లు సందేశాన్ని జోడించాడు. ఏప్రిల్‌ 18 నాటికి రైళ్లు ఏర్పాటు చేయకపోతే జాతీయ స్థాయిలో నిరసన చేపట్టబోతున్నట్లు ట్వీట్‌ చేశాడు.

వినయ్ పోస్టు కారణంగానే వలస కార్మికులు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదయం అతడ్ని అరెస్టు చేసి బాంద్రా పోలీస్​ స్టేషన్​కు తరలించారు. వినయ్‌ దూబేపై ఐపీసీ సెక్షన్లు.. 153-ఎ, 117, 188, 269, 270, అంటువ్యాధుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఓ టీవీ జర్నలిస్ట్‌ పైనా..

ఈ కేసులో రాహుల్‌ కులకర్ణి అనే టీవీ జర్నలిస్టునూ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. లాక్​డౌన్​ కారణంగా చిక్కుకున్న వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అసత్య వార్త ప్రసారం చేశారన్నది రాహుల్​పై ఆరోపణ.

ఇదీ చదవండి: 'కార్మికుల కష్టాలు చెప్పుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌లు'

Last Updated : Apr 15, 2020, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.