ETV Bharat / bharat

చిన్న బతుకులు పెద్ద మనసులు - Migrant laborers repairing their schools while in Quarantin in rajastan

క్వారంటైన్​లో ఉన్న వలసకూలీలు తమను ఆదరించిన గ్రామస్థులపై అభిమానం చాటుకున్నారు. తాముంటున్న పాఠశాలలకు రంగులు వేసి బాగుచేశారు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. సామాన్య కూలీలైన వారు పాఠశాల బాగుచేసినందుకు కనీసం కూలీ కూడా తీసుకోకపోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ విశేషంగా ప్రచారంలోకి వచ్చాయి.

Migrant laborers repairing their schools while in Quarantine
క్వారంటైన్‌లో ఉంటూ బడులను బాగుచేసిన వలస కూలీలు
author img

By

Published : Apr 23, 2020, 7:51 AM IST

లాక్‌డౌన్‌ సమయంలో ఆశ్రయమిచ్చిన బడులను వారు గుడులు అనుకున్నారు. అన్నం పెట్టిన గ్రామస్థులను ఆప్తులనుకున్నారు. మనసులోని కృతజ్ఞతాభావం వారిని ఊరకే కూర్చోనీయలేదు. ''సార్‌! బడుల గోడలు సున్నం రాలి, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. మాకు పెయింట్‌ ఇప్పించండి చాలు రంగులేస్తాం' అన్నారు పెద్దలతో. ప్రతిఫలంగా వారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. తొమ్మిదేళ్లుగా వెల్ల ఎరుగని ఆ బడులు... ఇప్పుడు తళతళలాడుతున్నాయి.

క్వారంటైన్‌లో ఉంటూనే..

హరియాణా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి వచ్చిన 54 మంది కూలీలకు... రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లా, పల్సానా పరిధిలోని షాహిద్‌ సీతారాం కుమ్వాత్‌, సేథ్‌ కె.ఎల్‌.తంబి ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు బస ఏర్పాటు చేశారు. పల్సానా సర్పంచి రూప్‌సింగ్‌ షెకావత్‌ వారికి ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. క్వారంటైన్‌ మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. అయితే ఆ కార్మికుల మనసులు ఆగలేదు. తాము ఉంటున్న బడులను బాగు చేయాలనుకున్నారు. వెంటనే... బడికి రంగులేస్తామని సర్పంచి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయులు కూడా ముందుకొచ్చి తలో కొంత వేసుకుని... కావలసిన రంగులు, సరంజామా సమకూర్చారు. అంతే. కార్మికులంతా కలిసి పాఠశాలల ఆవరణలను శుభ్రం చేసి, గోడలకు రంగులు వేసి వాటిని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వారి క్వారంటైన్‌ కూడా పూర్తయింది. కష్టానికి ప్రతిఫలంగా డబ్బులిచ్చినా... కార్మికులు తీసుకోలేదని, వారి మంచి హృదయానికి తమ ప్రజలు ఎంతో సంబర పడుతున్నారని షెకావత్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ విశేషంగా ప్రచారంలోకి వచ్చాయి.

ఇదీ చూడండి: నెల వ్యవధిలోనే 20 వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.