ETV Bharat / bharat

'రాహుల్​కు నోటీసుపై వివరాల వెల్లడి కుదరదు' - MHA refuses

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ జారీ చేసిన నోటీసుల వివరాలను వెల్లడించలేమని హోంశాఖ స్పష్టంచేసింది. సమాచారం బయటకు వెల్లడైతే విచారణ తప్పుదోవ పట్టే అవకాశముందని ఓ సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాధానమిచ్చింది.

'రాహుల్​కు నోటీసుపై వివరాల వెల్లడి కుదరదు'
author img

By

Published : Jun 4, 2019, 10:42 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై వాస్తవ పరిస్థితులను వెల్లడించాలన్న దరఖాస్తుపై సమాధానమిచ్చేందుకు తిరస్కరించింది కేంద్ర హోంశాఖ. నోటీసుల వివరాలను వెల్లడిస్తే విచారణ తప్పుదోవ పట్టే అవకాశముందని స్పష్టం చేసింది.

రాహుల్ పౌరస్థితిపై భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది హోంశాఖ. ఆయన పౌరసత్వంపై వచ్చిన అభియోగాలకు పక్షం రోజుల్లోగా సమాధానమివ్వాల్సిందిగా ఏప్రిల్​లో రాహుల్​కు నోటీసులు జారీ చేసింది.

విచారణకు ఆటంకం కలిగించే వివరాలను వెల్లడించకూడదన్న సమాచార చట్టం నిబంధన ప్రకారం వివరాల వెల్లడి కుదరదని పిటిషనర్​కు సమాధానమిచ్చింది.

నోటీసులకు ఆధారం..

బ్రిటన్​ కేంద్రంగా 2003లో ఏర్పాటైన బ్యాకప్స్​ లిమిటెడ్ కంపెనీలో రాహుల్ ఓ డైరెక్టర్​గా ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి తన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ దాఖలు చేసిన 2005, 2006నాటి వార్షిక రిటర్నుల్లో రాహుల్ బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జూన్​ 15న నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం

New Delhi, Jun 04 (ANI): Superstar Rajinikanth and actor Akshay Kumar starrer "2.0" will be released in China on July 12. Akshay on Tuesday took to social media to announce the film's China release. Music maestro A.R. Rahman, who is the music director for "2.0", too shared the news. "2.0", a sequel to the 2010 film "Enthiran", is directed by Shankar. The movie features Rajinikanth in triple role as scientist Vaseegaran, Robot Chitti and 2.0, an upgraded version of Chitti.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.