ETV Bharat / bharat

టీకా పంపిణీపై హోంశాఖ బ్లూప్రింట్

కరోనా టీకా పంపిణీలో కేంద్ర ఆరోగ్యశాఖకు పూర్తి సహాయసహకారాలు అందించేందుకు హోంశాఖ సిద్ధమైంది. ఇందుకోసం ఓ బ్లూప్రింట్ రూపొందించింది. రాష్ట్రాలతో సమన్వయం, టీకాపై అసత్య వార్తల కట్టడిపైనా ప్రత్యేక దృష్టిసారించింది.

mha, vaccine, కొవిడ్ వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్​కు ఏర్పాట్లు ముమ్మరం
author img

By

Published : Dec 31, 2020, 12:40 PM IST

కొవిడ్ టీకా పంపిణీలో కేంద్ర ఆరోగ్య శాఖకు సహకరించేందుకు సిద్ధమైన హోంశాఖ.. బ్లూప్రింట్​ను రూపొందించింది. టీకా పంపిణీ జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. ఈ ప్రక్రియను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్​ కుమార్ భల్లా ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షిస్తారని విశ్వసనీయ వర్గాలు ఈటీవీ భారత్​కు వెల్లడించాయి.

రాష్ట్రాలకు సూచనలు

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శులను కోరారు. టీకా పంపిణీకి కేంద్రం సన్నాహాలు జరుపుతోందని అధికారులకు స్పష్టం చేశారు. నిపుణుల సంఘం సూచించిన విధంగా టీకాను.. మొదట అత్యవసర సేవలు అందించేవారికి, 50 ఏళ్లు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు ఉన్నా తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఉన్న వారికి అందించాలన్నారు.

ఇటీవలె రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భల్లా లేఖ రాశారు. వ్యాక్సిన్ పంపిణీ, భద్రత, రవాణ, సమాచార సేకరణ వంటి అంశాల్లో కేంద్ర ఆరోగ్య శాఖకు సహకరించాలని అందులో పేర్కొన్నారు.

టీకా పంపిణీ సమయంలో సమన్వయంతో పనిచేయడంపై హోంశాఖ, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే చర్చించుకున్నారు.

పటిష్ఠంగా...

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకారం అందించాలని కేంద్ర భద్రతా బలగాలను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. అసాంఘిక శక్తులు ఈ ప్రక్రియను తప్పుదోవ పట్టించకుండా ఉండేందుకు హోంశాఖ.. కేంద్ర సమాచార శాఖ సహాయం కోరింది.

సైబర్ దోస్త్ హెచ్చరిక..

వ్యాక్సిన్​ పంపిణీను ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోం శాఖకు చెందిన సైబర్​ దోస్త్ హెచ్చరించింది. తొలి టీకా అందిస్తామంటూ మోసాలకు యత్నిస్తారని.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి : టీకా తీసుకున్న 10 రోజులకు కొవిడ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.