అన్లాక్ 4.0లో భాగంగా సెప్టెంబర్ 1న మెట్రో రైళ్ల సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కానీ.. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారవర్గాలు తెలిపాయి.
కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్తో మార్చి నెల చివర్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు తిరిగి ప్రారంభం కాలేదు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మూతపడిన బార్లకు అన్లాక్ 4.0లో ఊరటనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌంటర్ వద్దే మద్యం అమ్మకాలు చేపట్టేందుకు అనుమతించే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.