ETV Bharat / bharat

మహిళలకు ఉచిత ప్రయాణంపై 'మెట్రోమ్యాన్'​ గరం

దిల్లీ ప్రభుత్వం  ఇటీవలే విశిష్ట పథకాన్ని తీసుకొచ్చింది. రాజధాని పరిధిలోని బస్సులు, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. అయితే.. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపవద్దని ప్రధానిని అభ్యర్థించారు 'మెట్రోమ్యాన్'​ శ్రీధరన్​. ఇదో అసమర్థ, పేలవమైన చర్యగా అభివర్ణించారు.

మహిళలకు ఉచిత ప్రయాణంపై మెట్రోమ్యాన్​ గరం
author img

By

Published : Jun 14, 2019, 6:57 PM IST

దిల్లీలోని ఆమ్​ఆద్మీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పథకానికి సరికొత్త చిక్కులొచ్చి పడ్డాయి. దిల్లీ మెట్రో రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించారు మెట్రోమ్యాన్​ శ్రీధరన్​. దిల్లీ మెట్రో రైల్​ కార్పొరేషన్​-డీఎంఆర్​సీకి గతంలో సారథిగా పనిచేశారు శ్రీధరన్​.

''ఒకవేళ దిల్లీ ప్రభుత్వానికి మహిళలకు సహాయం చేయాలని ఉంటే.. మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం కంటే.. వారి ప్రయాణ ఖర్చును వారికే ప్రత్యక్షంగా చెల్లిస్తే మంచిదని నా సలహా'' అని ప్రధానమంత్రికి లేఖ రాశారు శ్రీధరన్​.

ఈ అంశంలో మోదీని జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు.

ఎవరైనా టికెట్​ తీసుకోవాల్సిందే...

దిల్లీలో మొదటి దశ మెట్రోను 2002లో ప్రారంభించినపుడు ఏ ఒక్కరికీ ప్రయాణ రాయితీని కల్పించవద్దని డీఎంఆర్​సీ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు శ్రీధరన్. అప్పటి ప్రధాని వాజ్​పేయీ సైతం... మెట్రోను ప్రారంభించిన సమయంలో టికెట్​ కొనుగోలు చేసినట్లు తెలిపారీ సివిల్​ ఇంజినీర్​. సిబ్బంది, ఎండీ, అధికారులు ఎవరైనా టికెట్​ తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారాయన.

దిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను అసలే అంగీకరించకూడదని మోదీని హృదయపూర్వకంగా విన్నవిస్తున్నట్లు పేర్కొన్నారు శ్రీధరన్​. మహిళల ఉచిత ప్రయాణ పథకం ఇక్కడ ప్రవేశపెడితే.. దేశమంతా ఇవే డిమాండ్లు పెరిగిపోతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా జరగడం ఏమాత్రం మంచిది కాదని లేఖలో వివరించారు శ్రీధరన్.

దిల్లీ మెట్రో రైల్​ కార్పొరేషన్​పై దిల్లీ ప్రభుత్వం, కేంద్రానికి సమాన అధికారాలు ఉంటాయి. ఏ ఒక్కరూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. శ్రీధరన్​ లేఖతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇదీ చూడండి: బస్సులు, మెట్రోలో మహిళలకు ప్రయాణం ఉచితం!

New Delhi, June 13 (ANI): United States (US) missions in India observed the fifth annual student visa day to celebrate educational ties between India and the US. The day is dedicated to help qualified Indian students who prepare for their higher studies in the United States and connect them with various educational universities. A network of US-sponsored advising centres dedicated to assisting students in finding the appropriate university was also set-up during this day. On the occasion, Charge d'Affaires MaryKay Loss Carlson in New Delhi and Consulate General throughout India congratulated the applicants as they joined the growing ranks of Indian students who choose to study in the US at the world's leading academic institutions.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.