ETV Bharat / bharat

తల్లి, అన్నను తుపాకీతో కాల్చి చంపిన మైనర్ బాలిక - murder

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో సొంత తల్లి, అన్ననే కాల్చిచంపింది ఓ మైనర్ బాలిక. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్​ అధికారిక నివాసానికి సమీపంలో ఈ ఘటన జరగటం గమనార్హం.

Lucknow
హత్య
author img

By

Published : Aug 29, 2020, 10:24 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో దారుణం జరిగింది. తన తల్లితో పాటు సోదరుడిని ఓ మైనర్ బాలిక కాల్చి చంపింది. బాలిక మానసిక ఆరోగ్యం సరిగా లేదని పోలీసులు వెల్లడించారు. తను శిక్షణ పొందిన షూటర్​ అని తెలుస్తోంది.

మృతిచెందిన వారు రైల్వే ప్రజా సంబంధాల అధికారి రాజేశ్​ దత్​ భార్య మాలతి, కుమారుడు సర్వాదత్​గా గుర్తించారు పోలీసులు.

"రాజేశ్​ ఇంట్లో మాలతితో ఆమె కుమారుడు సర్వాదత్​ మృతదేహాలు ఉన్నాయి. అక్కడే రాజేశ్​ కూతురు కూడా ఉంది. ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఆమెనే సమాచారం ఇవ్వగా.. అతను పోలీసులకు ఫోన్​ చేశాడు. ఈ నేరం తనే చేసినట్లు బాలిక అంగీకరించింది. ఆమె శరీరంపై బ్లేడుతో కోసుకున్న గాయాలు ఉన్నాయి. బాలిక తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమెను బాలిక సంరక్షణ కేంద్రానికి తరలిస్తాం."

- సుజిత్ పాండే, లఖ్​నవూ పోలీస్ కమిషనర్

బాత్రూమ్​లో అద్దంపై 'అర్హతలేని మనుషులు' అని రాసిందని దర్యాప్తు బృందం గుర్తించింది. అదే అద్దంపై మొదటి తూటా పేల్చిందని.. అనంతరం తన తల్లిని కాల్చిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తన సోదరుణ్ని కాల్చినట్లు వివరించారు.

ఎవరూ క్షేమంగా లేరు..

priyanka
ప్రియాంక గాంధీ

ఈ హత్యకు సంబంధించి వార్తలు రాగానే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. యోగి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం అధికారిక నివాసానికి సమీపంలో ఈ ఘటన జరగటం ఆటవిక రాజ్యాన్ని గుర్తు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎవరూ క్షేమంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.