ETV Bharat / bharat

పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమరులకు 'స్మారక చిహ్నం'

గతేడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్​ జవాన్ల జ్ఞాపకార్థం శుక్రవారం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధికారులు. జవాన్ల పేర్లు, ఫొటోలతో కూడిన చిహ్నాన్ని ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే ప్రతిష్టించనున్నారు.

Memorial to 40 CRPF jawans killed in Pulwama attack to be inaugurated on Friday
పుల్వామా ఉగ్రదాడి జరగిన చోటే అమరులకు 'స్మారక చిహ్నం'
author img

By

Published : Feb 13, 2020, 9:05 PM IST

Updated : Mar 1, 2020, 6:14 AM IST

గతేడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఘటనలో ప్రాణాలర్పించిన సీఆర్పీఎఫ్​ జవాన్ల జ్ఞాపకార్థం...జమ్ముకశ్మీర్​లో స్మారక చిహ్నాన్ని రేపు శంకుస్థాపన చేయనున్నారు అధికారులు. ఉగ్రదాడిలో 40 మంది వీరజవాన్లు ప్రాణాలు కోల్పోయి.. ఏడాది అయిన సందర్భంగా.. స్మారక చిహ్నంతో నివాళులర్పించనున్నట్లు సీఆర్​పీఎఫ్​ అదనపు డైరక్టర్​ జనరల్​ జుల్ఫికర్​ హసన్​ తెలిపారు.

ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలోనే ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసిన ఆయన.. 40 మంది అమరుల పేర్లు, ఫొటోలతో పాటు సేవా-నిష్ఠ అనే నినాదాన్ని చిహ్నంలో పొందుపర్చినట్లు వెల్లడించారు.

" గతేడాది జరిగిన ఉగ్రదాడి ఓ దురదృష్టకర ఘటన. ఆ దుర్ఘటన నుంచి మేము ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం. మా విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాము, అయితే పుల్వామా ఉగ్రదాడి తర్వాత మా అప్రమత్తత మరింత పెరిగింది. 40 మంది జవాన్ల అత్యున్నత త్యాగాలు దేశంలో శత్రువులను నిర్మూలించాలనే మా సంకల్పాన్ని మరింత పెంచింది."

-జుల్ఫికర్​ హసన్, సీఆర్​పీఎఫ్​ అదనపు డైరక్టర్​ జనరల్

ఇదీ చూడండి: భారత పర్యటనపై మెలానియా ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Last Updated : Mar 1, 2020, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.