అమెరికాలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం హైదరాబాద్‍లోని యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 2 నుంచి 10 వరకు జరిగే ఈ ఫెయిర్‌లో సుమారు 100కు పైగా ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయాలతో సంప్రదించే అవకాశం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్‌డీకి సంబంధించి అవకాశాలు, సందేహాల నివృత్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు నిర్వాహకులు. వర్చువల్ విధానంలో జరిగే ఈ ఫెయిర్‍కు అమెరికాలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు భారతదేశంలోని ఏ మూల నుంచైనా పాల్గొనవచ్చని తెలిపారు.
ప్రత్యేకతలు..
- విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో దరఖాస్తు విధానం, ఆర్థిక సహకారం వంటి విషయాలపై ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం.
- కొత్త బ్రోచర్లు, విశ్వవిద్యాలయాల విధానాలను ఫెయిర్‌లో పొందవచ్చు.
- వివిధ అంశాలకు సంబంధించిన సలహాలు పొందవచ్చు.
- ప్రవేశ పరీక్షల విషయంలో నిర్దిష్ట సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు, వివరాలు..
గ్రాడ్యుయేట్ ఫెయిర్: అక్టోబర్ 2-3 (సాయంత్రం 5.30 - రాత్రి 10.30 గంటలు)
రిజిస్ట్రేషన్ కోసం: bit.ly/EdUSAFair20-Bmail
అండర్ గ్రాడ్యుయేట్ ఫెయిర్: అక్టోబర్ 9-10 (సాయంత్రం 5.30 - రాత్రి 10.30 గంటలు)
రిజిస్ట్రేషన్ కోసం: bit.ly/UGEdUSAFair20-BMail
ఫెయిర్‍కు సంబంధించి ఏవైనా సందేహాలు, సూచనల కోసం usiefhyderabad@usief.org.in కు మెయిల్ చేయవచ్చని ఎడ్యుకేషన్ యూఎస్ఏ కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: ఉత్తరాలు పంచే పోస్ట్‌మ్యాన్ నటనకు ప్రాణం పోస్తే..?