జమ్ముకశ్మీర్ అవంతిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. జిల్లాలోని పాంపోర్‌లో భద్రతా బలగాలు నిన్న రాత్రి తనిఖీలు చేపడతుండగా మసీదును ఆనుకుని ఉన్న భవనంలో ఉగ్రవాదులు తారసపడ్డారు.
ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా బలగాలు ప్రతిఘటించాయి. ఆ భవనంపై ఒక గ్రెనేడ్‌తో దాడి చేయగా.. ఉగ్రవాదులు తొలుత మసీదులోకి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ముష్కరులు పక్కన ఉన్న ఒక షెడ్లోకి వెళ్లగా బలగాలు తిరిగి కాల్పులను ప్రారంభించాయి.