ETV Bharat / bharat

'మీ దగ్గర సమస్య పెట్టుకొని మమ్మల్ని నిందిస్తారా?' - అనురాగ్​ శ్రీ వాస్తవ, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి.

కరాచీ స్టాక్‌ ఎక్స్ఛేంజీపై ఉగ్రవాదుల దాడి వెనుక భారత హస్తం ఉందంటూ పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది భారత్​. అవి పనికిమాలిన వ్యాఖ్యలని పేర్కొంది​. ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా భారత్​ ఖండిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

mea-rejects-allegations-made-by-pakistans-foreign-minister
'మీ దగ్గర సమస్య పెట్టుకొని మమ్మల్ని నిందిస్తారా?'
author img

By

Published : Jun 30, 2020, 9:12 AM IST

Updated : Jun 30, 2020, 9:27 AM IST

కరాచీ స్టాక్‌ ఎక్స్ఛేంజీపై ఉగ్రవాదుల దాటి వెనుక భారత స్లీపర్​ సెల్స్​ హస్తం ఉందంటూ పాకిస్థాన్​ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మొహమ్మద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలను భారత్​ తప్పుబట్టింది. అవి పనికిమాలిన వ్యాఖ్యలని కొట్టిపారేసింది.

"సొంత దేశంలో సమస్యలను పెట్టుకుని భారత్​ను నిందించటం సరికాదు. ఖురేషీవి అసంబద్ధ వ్యాఖ్యలు. కరాచీలోనే కాదు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద చర్య జరిగినా భారత్​ ఖండిస్తుంది. మీ ప్రధానే స్వయంగా... అంతర్జాతీయ ఉగ్రవాదులను అమరవీరుడిగా అభివర్ణించారు. కాబట్టి ఉగ్రవాదంపై మీ ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రపంచానికి తెలియజేయాలి."

-అనురాగ్​ శ్రీ వాస్తవ, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి.

ఉగ్రదాడి....

అత్యంత పటిష్ఠ భద్రతా వలయంలో ఉండే కరాచీలోని పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ భవనంపై ఉగ్రవాదులు సోమవారం దాడి చేశారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. ఇందులో దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు సహా, నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఓ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు సాధారణ పౌరులున్నారు. బలోచిస్థాన్​ లిబరేషన్​ ఆర్మీ(బీఎల్​ఏ).. దాడి చేసింది తామేనని ప్రకటించుకుంది.

ఇదీ చూడండి:మరింత గుట్టుగా యువజనంపై మాదకపంజా!

Last Updated : Jun 30, 2020, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.