ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కొచ్చిన రాజస్థాన్ రాజకీయంపై అనుమానం వ్యక్తం చేశారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకున్నట్లే కనిపిస్తోంది కానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ల మధ్య మరోసారి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు.
రాజస్థాన్ శాసన సభా సమావేశాలు ఈ నెల 14 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
"రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సురక్షితంగానే కనిపిస్తోంది. పైలట్, గహ్లోత్‌ల డ్రామా మళ్లీ మొదలవ్వదని చెప్పలేం. కరోనా నుంచి ప్రజలను కాపాడే చర్యలపై రాజస్థాన్ కాంగ్రెస్ ఇప్పటికీ దృష్టిసారించట్లేదు. వీరి మధ్య అంతర్గత వివాదం భవిష్యత్తులోనూ చెలరేగే అవకాశముంది. ఈ పరిస్థితిని విచారించి.. రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా."
- మాయావతి, బీఎప్పీ అధ్యక్షురాలు
ఇదీ జరిగింది...
గహ్లోత్ ప్రభుత్వంపై అసంతృప్తితో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. స్పీకర్ అనర్హత నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. కొద్దిరోజులు గహ్లోత్, పైలట్ ఎవరి క్యాంప్ వారే నడుపుతూ రాజకీయాన్ని వేడెక్కించారు. అయితే, ఎట్టకేలకు రాహుల్ గాంధీ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇదీ చదవండి: ప్రణాళికా లోపాలే లద్దాఖ్‌లో సైనికుల పాలిట శాపాలు