ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ద్వయం ఎన్నిసార్లు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించినా ఈసీ చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తోందని ఆరోపించింది. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ.
"మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి) కాస్తా మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్ (మోదీ ప్రవర్తన నియమావళి) అయిందా?. ఎలక్షన్ కమిషన్.. ఎలక్షన్ ఒమిషన్ అయిందా? మోదీ, షా ద్వయం కోసం ఎన్నికల కోడ్ను అమలు చేయడం నిలిపివేశారా? వారిద్దరికీ ఎన్నికల ప్రవర్తన నియమావళి మినహాయింపా? మూడు ప్రధానాంశాల్లో ఎన్నికల కోడ్ను అతిక్రమించారు. విభజన, మనస్పర్ధలు సృష్టించే విధంగా మోదీ, షా ద్వయం ప్రసంగాలున్నాయి. అమర జవాన్ల త్యాగాలపై రాజకీయం చేస్తున్నారు. పోలింగ్ రోజు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు ఇంతకు ముందెన్నడూ జరగలేదు. "
-అభిషేక్ మను సింఘ్వీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఇదీ చూడండి: మోదీ లెక్కకు మించి ఖర్చు చేశారు: ఆప్