కరోనా వైరస్ ప్రపంచాన్నే మార్చేసింది. మాస్క్ లేకుండా ఇంటి గడప దాటాలన్నా భయమేస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఎలాంటి భయం లేకుండా.. మాస్క్ ధరించకుండా యథేచ్చగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో కరోనాపై అవగాహన కల్పించడం కోసం ఎన్నో పాటలు, వివిధ రకాల మాస్క్లు వచ్చాయి.
తాజాగా తమిళనాడు మధురైలో వంటకాలను మాస్క్ ఆకారంలో చేసి వినూత్నంగా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది ఓ హోటల్ యాజమాన్యం. మాస్క్ ఆకారంలో పరోటా, కరోనా వైరస్ ఆకృతిలో దోశను తయారు చేసి వినియోగదారులకు వడ్డిస్తున్నారు. అంతేకాకుండా ఇవి తిన్నవారికి ఉచితంగా పానీయాలు కూడా ఇస్తున్నారు.
ఇదీ చూడండి: 'ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలో కీలకంగా భారత్'