బిహార్‌లోని సహర్సా జిల్లాలో సోమవారం ఒకే వేదికపై సామూహిక వివాహ వేడుక నిర్వహించింది ఈ సంస్థ. వందలాది మంది సమక్షంలో 60 ముస్లిం వివాహాలు ఘనంగా జరిగాయి.
దేశంలో ఇంతమంది ముస్లిం జంటలకు ఒకే వేదికపై సామూహిక వివాహ వేడుక జరగడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు.
"ఇలాంటి కార్యక్రమాలు గుజరాత్లో గత ఐదారేళ్లుగా నిర్వహిస్తున్నాం. ఇకనుంచి బిహార్, అసోం, బంగాల్ రాష్టాల్లోనూ నిర్వహిస్తాము."
-మౌలానా హమిద్ అహ్మద్, ఇస్సా ఛైర్మన్
భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు వివాహ వేడుక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మౌలానా. ఈ వేడుకకు హాజరైన వందలాది మందికి భోజన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఒక్కటైన నూతన జంటలకు కానుకగా ఇంటి సామాన్లనూ బహూకరించారు.
"పెళ్లి వేడుక చేసుకునే స్తోమత లేని పేదవారి కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.నా వినతిని మన్నించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఛైర్మన్‌కు ధన్యవాదాలు"
-వేడుక నిర్వాహకులు