ETV Bharat / bharat

మావోయిస్టుల దుశ్చర్య- 12 అటవీశాఖ భవనాలు పేల్చివేత - ఝార్ఖండ్​ పశ్చిమ సింగ్​భూమ్​ అటవీ ప్రాంత ఘటన

ఝార్ఖండ్​లో పశ్చిమ సింగ్​భూమ్​ జిల్లాలో అటవీ శాఖకు చెందిన 12 భవనాలను పేల్చి వేశారు మావోయిస్టులు. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన కొల్​హన్​ డీజీపీ వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Maoists blow up 12 buildings in Jharkhand
12 అటవీ భవనాలను పేల్చిన మావోయిస్టులు
author img

By

Published : Jul 12, 2020, 5:11 PM IST

ఝార్ఖండ్​ పశ్చిమ సింగ్​భమ్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఆ రాష్ట్ర అటవీ శాఖకు చెందిన 12 భవనాలను పేల్చి వేశారు.

Maoists blow up 12 buildings in Jharkhand
మావోయిస్టులు పేల్చిన భవనం

శనివారం రాత్రి కొంత మంది మావోయిస్టులు బెర్​కేలా అటవీ ప్రాంతంలో ఉన్న భవనాలను చుట్టుముట్టి పోలీసులను అక్కడ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అక్కడ ఉన్న కొంత మంది అధికారులపై దాడి చేశారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

బాంబు తాకిడికి ధ్వంసమైన భవనం

మరో భవనం

అనంతరం భవనాలను ఖాళీ చేయించి.. ఒకదాని తర్వాత మరొక దానిని ఐఈడీ బాంబుతో పేల్చి వేశారు.

కుప్పకూలిన మరో భవనం

మవోయిస్టుల చర్యను తీవ్రంగా ఖండించిన కోల్​హన్ డీఐజీ.. నక్సల్స్​ కోసం గాలింపు చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలెవ్వరూ వారికి సహాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:స్మగ్లింగ్​ కేసు: కేరళకు బంగారు కి'లేడీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.