సాగు చట్టాల విషయంలో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నుంచి భూపేంద్ర సింగ్ మాన్ తప్పుకున్నారు. తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడైన మాన్.. తనను కమిటీలో ఒకరిగా నియమించినందుకు సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

రైతుల ప్రయోజనాల కోసం రాజీ పడనని స్పష్టం చేసిన భూపేంద్ర.. ఈ విషయంలో తనకు ఇచ్చిన ఏ పదవినైనా త్యాగం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. రైతులు, పంజాబ్ వెంటే ఉంటానని తెలిపారు.
-
S. Bhupinder Singh Mann Ex MP and National President of BKU and Chairman of All India Kisan Coordination Committee has recused himself from the 4 member committee constituted by Hon'ble Supreme Court pic.twitter.com/pHZhKXcVdT
— Bhartiya Kisan Union (@BKU_KisanUnion) January 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">S. Bhupinder Singh Mann Ex MP and National President of BKU and Chairman of All India Kisan Coordination Committee has recused himself from the 4 member committee constituted by Hon'ble Supreme Court pic.twitter.com/pHZhKXcVdT
— Bhartiya Kisan Union (@BKU_KisanUnion) January 14, 2021S. Bhupinder Singh Mann Ex MP and National President of BKU and Chairman of All India Kisan Coordination Committee has recused himself from the 4 member committee constituted by Hon'ble Supreme Court pic.twitter.com/pHZhKXcVdT
— Bhartiya Kisan Union (@BKU_KisanUnion) January 14, 2021
సాగు చట్టాల అమలుపై రైతులు, ప్రభుత్వంతో చర్చల కోసం జనవరి 12న ఈ కమిటీ నియమించింది అత్యున్నత న్యాయస్థానం. అయితే.. ఈ కమిటీపై రైతు సంఘాలు, విపక్షాలు పెదవి విరిచాయి. సభ్యులంతా గతంలో వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడినవారేనని తెలిపాయి.
ఇదీ చూడండి: సాగు చట్టాలపై సుప్రీం స్టే- వివాద పరిష్కారానికి కమిటీ