ETV Bharat / bharat

పాత ఇంజిన్​తో.. 'నందన్' సరికొత్త ఆవిష్కరణ​ - బహుళ ప్రయోజన యంత్రం

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ సమయాన్ని వినియోగించి అద్భుతాలను ఆవిష్కరించారు కొందరు. అలాంటి కోవకే చెందుతాడీ కర్ణాటక యువ ఇంజినీరింగ్ నందన్​ గౌడ. మంగళూరులోని మర్దాలా ప్రాంతానికి చెందిన నందన్..​ బహుళ ప్రయోజన యంత్రాన్ని తయారు చేసినట్లు తెలిపాడు. ఇందుకోసం లాక్​డౌన్​ సమయం బాగా కలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు​.

Mangaluru young engineer invents multi-purpose machine amid lockdown
పాత ఇంజిన్​తో.. నందన్ సరికొత్త ఆవిష్కరణ​
author img

By

Published : Jul 13, 2020, 2:07 PM IST

పాత బైక్​ అంటూ ఉంటే సెకండ్​ హ్యాండ్​లో అమ్మడం, కొనడం చూస్తుంటాం. కాస్త వినూత్నంగా ఆలోచించిన ఓ యువ ఇంజినీర్​ దాని ఇంజిన్​ను మరో రకంగా ఉపయోగించి బహుళ ప్రయోజన యంత్రంగా మార్చాడు. లాక్​డౌన్​లో వచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ అద్భుత ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు ఓ కర్ణాటక వాసి.

పాత ఇంజిన్​తో.. నందన్ సరికొత్త ఆవిష్కరణ​

6 మంది - ఒకేసారి..

వృత్తిరీత్యా ఇంజినీర్​ అయిన నందన్​.. వ్యవసాయంలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయడం సహా.. వాహనాలను శుభ్రం చేసుకొనేందుకు వీలుగా యంత్ర పరికరాన్ని రూపొందించాడు. ఫలితంగా చుట్టుపక్కల గ్రామాల్లో అతడి పేరిప్పుడు మార్మోగుతోంది. ఈ యంత్ర పరికరాన్ని ఉపయోగించి ఆరుగురు వ్యక్తులు ఒకేసారి పనిచేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక లీటర్​ పెట్రోల్​తో 600 అరెకా(పోక) చెట్లకు పిచికారీ చేయవచ్చని నందన్​ పేర్కొన్నాడు.

'చిన్ననాటి నుంచే ఆవిష్కణలంటే నాకు అమితాసక్తి. 5వ తరగతి నుంచే ప్రయోగాలు చేయడం ప్రారంభించా. కానీ ఇంజినీరింగ్​ చదువుతున్న కొద్దికాలం ప్రయోగాలను ఆపేశాను. అయితే లాక్​డౌన్​ కారణంగా మళ్లీ నా ఆవిష్కరణలకు పదునుపెట్టాను.'

- నందన్​ గౌడ

ప్రభుత్వం తోడ్పాటునందిస్తే..

అయితే వ్యవసాయం కోసం మరిన్ని ఆవిష్కరణలపై దృష్టి చేశానని చెప్పాడు నందన్​. పాఠశాల విద్యార్థులకూ ఇలాంటి నమూనాలను తయారు చేసి ఇచ్చానన్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయమందిస్తే.. మరిన్ని మెషీన్​లను తయారుచేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ఇదీ చదవండి: 'జీవితాలను సరిదిద్దుకొనే సమయమిదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.