ETV Bharat / bharat

ఆ ఒక్కడు.. 171 ప్యాకెట్ల రక్తం దానం చేశాడు

తల్లి రక్తం పంచుకుని పుడతాం కానీ, నోట్ల కట్టలు మెడలో వేసుకుని పుట్టం కదా..! ఈ ఒక్క ఉదాహరణ చాలదా మన ఒంట్లో పారే నెత్తురు.. ఆపదలో ఉన్న మరొకరికి జీవం పోయగలదని! అచ్చంగా ఇలాగే అనుకున్నాడు కశ్మీర్​కు చెందిన ఆ 'బ్లడ్​ మ్యాన్'. అందుకే ఏటా నాలుగైదు సార్లు రక్తదానం చేసి.. వందలాది మంది ప్రాణాలు కాపాడుతున్నాడు. 39 ఏళ్లుగా, 171 పింట్ల రక్తం దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Man with a mission: 'Blood man' of Kashmir has donated 171 pints in 39 years
ఆ ఒక్కడు.. 171 ప్యాకెట్ల రక్తం దానం చేశాడు!
author img

By

Published : Jun 27, 2020, 1:12 PM IST

'కశ్మీరీ​ బ్లడ్​ మ్యాన్​'గా గుర్తింపు పొందిన షాబిర్​ హుస్సేన్​ ఖాన్.. రక్తదానం చేయడమే తన అలవాటుగా మార్చుకున్నాడు. 39 ఏళ్లుగా ఏటా నాలుగైదు సార్లు రక్తదానం చేస్తూ.. యువతకు దాని విలువ తెలియజేస్తున్నాడు.

13 ఏళ్ల వయసులోనే...

చూడడానికి సాదాసీదాగా కనిపించే 50 ఏళ్ల​ ఖాన్​ మనసులో.. భారీ ఆశయమే ఉంది. ఆనందమనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదని, చిరునవ్వుతో వచ్చే సంతృప్తి అని బాల్యంలోనే గ్రహించాడు. అవును, శ్రీనగర్​, షేర్​ ఏ ఖాస్​, నౌహట్టాకు చెందిన ఖాన్​ 1980లో తన స్నేహితుడి కోసం తొలిసారిగా రక్తదానం చేశాడు. అప్పుడు ఖాన్​ వయసు కేవలం 13 ఏళ్లు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఓ ఐదు సార్లు రక్తదానం చేయడం ఖాన్​కు జీవితంలో భాగమైపోయింది.

ఇప్పటికే 171 పింట్ల రక్తదానం చేశాడు ఖాన్​. ఒక్కో పింట్​ ప్యాకెట్​లో దాదాపు 475 మిల్లీలీటర్ల రక్తం ఉంటుంది. ఇంత రక్తం ధారపోసినా..తాను ఆరోగ్యంగానే ఉన్నానంటున్నాడు ఖాన్​. అంతే కాదు.. మరో 15 ఏళ్లపాటు... రక్తదానం చేయడం ఆపబోనని... ఇది ఆరోగ్యవంతమైన పౌరుల కర్తవ్యం అని అంటున్నాడు. ఇందుకు తన కుటుంబ సహకారమూ ఉండడం విశేషం.

"ఏటా నాలుగైదు సార్లు రక్తదానం చేస్తాను. ఈ అలవాటు నా ఆరోగ్యాన్ని ఏమాత్రమూ ప్రభావితం చేయలేదు. పైగా నా నెత్తుటి చుక్క వల్ల కొందరి ప్రాణాలు నిలుస్తాయి.. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది. అలా అలవాటైపోయింది. నాకు 65 ఏళ్లు వచ్చేంతవరకు నేను రక్తదానం ఆపను. ఎందరో ముఖాల్లో చిరునవ్వులు, ప్రజల నుంచి వచ్చే సానుకూల స్పందన నాకు హాయినిస్తాయి. డబ్బే సర్వస్వం అనుకుంటున్న ఈ తరం యువకులు.. రక్తదానం చేసి, ఇతరుల ప్రాణాలు కాపాడితే... దేవుడికి సేవ చేసినట్టేనని గుర్తించాలి"

-షాబిర్​ హుస్సేయిన్​ ఖాన్

ఆసుపత్రుల చుట్టే మనసంతా..

ప్రతి రోజు రెండు గంటలు ఆసుపత్రుల్లోనే గడుపుతాడు ఖాన్​. రక్తం అవసరముండి, వారిని పట్టించుకునేవారెవ్వరూ లేని వారి వివరాలు తీసుకుంటాడు. ఆపై తన బృందంతో అక్కడికి వెళ్లి.. రక్తదానం చేయిస్తాడు. ​అంతే కాదు.. ఖాన్​ రెడ్​క్రాస్​ సేవా సంఘంలో శాశ్వత సభ్యుడు. రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాడు. కరోనా కాలంలోనూ ముందుండి తనవంతు సాయం చేస్తున్నాడు.

ఖాన్​ను ఆదర్శంగా తీసుకుని కశ్మీర్​లో ఎంతో మంది రక్తదానానికి ముందుకొస్తున్నారు. ఖాన్​​ స్నేహితుడు, బృంద సభ్యుడయిన గులాం హస్సన్​ మీర్​.. 20 ఏళ్లలో దాదాపు 80 పింట్ల రక్తదానం చేశాడు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఖాన్​ను గుర్తించట్లేదని విచారం వ్యకం చేస్తున్నారు ఆయన స్నేహితులు.

ఇదీ చదవండి:కరోనిల్​పై 'మహా' నిషేధం- బాబాకు వార్నింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.