ETV Bharat / bharat

కళ్లలో కారంకొట్టి బంగారం చోరీకి విఫలయత్నం! - నగల షాపు యజమానిపై కారం జల్లి

నగల షాపు యజమానిపై కారం జల్లి 50 గ్రాముల బంగారం దొంగతనానికి యత్నించిన ఘటన మధ్యప్రదేశ్​ ఇందోర్​లో జరిగింది. నిందితుడు షాపు నుంచి పారిపోతుండగా చుట్టుపక్కల వాళ్లు అతడిని పట్టుకున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశారు పోలీసులు.

Man throws chilli powder in attempt to rob jewellery shop
కారం జల్లి దొంగతనానికి యత్నించిన దుండగుడు
author img

By

Published : Aug 21, 2020, 1:11 PM IST

మనం జ్యువెలరీ దుకాణానికి వెళ్లి నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కొని వెళ్తాం. ఓ వ్యక్తి మాత్రం.. కారం తీసుకొని వెళ్లి నగలను దొంగతనం చేయటానికి ప్రయత్నించాడు. అది కాస్త విఫలమవ్వటం వల్ల ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. మధ్యప్రదేశ్ ఇందోర్​​ ప్రాంతంలో జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..

లవీన్ సోనీ.. సరాఫా ప్రాంతంలో నగల దుకాణం నడుపుతున్నాడు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఓ వ్యక్తి సాధారణ వినియోగదారునిలాగే షాపులోకి ప్రవేశించాడు. మాట్లాడుతూ కాసేపటికి షాపు యజమాని కళ్లలో కారం జల్లి 45-50 గ్రాముల బంగారంతో ఉడాయించాలని ప్రయత్నించాడు. తప్పించుకునే సమయంలో సోనీ కేకలు వేయగా.. షాపు బయట ఉన్న వ్యక్తులు ఆ ఘరానా దొంగను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీటీవీలో రికార్డయ్యాయి.

కళ్లలో కారంకొట్టి బంగారం చోరీకి యత్నం

ఈ ఘటనపై సోనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి 'యోగీ హయాంలో యూపీ​లో భారీగా తగ్గిన నేరాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.