ఉత్తరప్రదేశ్‌లో గురువారం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చి వేలు కోసుకున్నాడు.
ఇదే కారణం...
బులంద్‌షహర్ జిల్లాలోని హులాస్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల పవన్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. కానీ ఈవీఎంలో అనుకోకుండా బీఎస్పీకి బదులు భాజపా మీట నొక్కాడు.
ఇంటికి తిరిగిన వచ్చిన పవన్ ఆగ్రహంతో వేలు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.